వీకెండ్‌ దాటితే థియేటర్లలో ఈగలే

వీకెండ్‌ దాటితే థియేటర్లలో ఈగలే

విడుదలకి ముందు అంతో ఇంతో క్రేజ్‌ వున్న సినిమా విడుదలైతే ఇప్పుడు దాని టాక్‌తో సంబంధం లేకుండా ఫస్ట్‌ వీకెండ్‌ మాత్రం చూసి పారేస్తున్నారు. మరీ డిజాస్టర్‌ టాక్‌ వస్తే తప్ప ఏ సినిమాకి అయినా మొదటి వారాంతం వరకు ఢోకా వుండట్లేదు. దీంతో మొదటి వారాంతంలో వచ్చిన వసూళ్లని చూసి 'మా సినిమా బ్లాక్‌బస్టర్‌' అంటూ చెప్పుకోవడం, ఆ సినిమా బాగాలేదని రాసిన రివ్యూలపై 'తొడగొట్టడం' కామన్‌ అయిపోయింది.

అయితే ఒక వీకెండ్‌ దాటిన తర్వాత సదరు సినిమాల అసలు బాగోతాలు బయట పడుతున్నాయి. ఈమధ్య కాలంలో మహానుభావుడు తప్ప అన్ని సినిమాలు అంతో ఇంతో నష్టపోయాయి. స్పైడర్‌, పైసావసూల్‌ స్థాయి డిజాస్టర్లు కాకపోయినా కానీ సెప్టెంబర్‌ నుంచి వచ్చిన సినిమాల్లో లాభాలు గడించినవి బహు తక్కువ. రాజా ది గ్రేట్‌ సినిమాకి కూడా దిల్‌ రాజు తప్ప మిగతా బయ్యర్లు ఇంకా సేఫ్‌ అవలేదని ట్రేడ్‌ టాక్‌. శుక్రవారం రిలీజ్‌ అయిన ఉన్నది ఒకటే జిందగీ చిత్రం వసూళ్లు సైతం సోమవారం గణనీయంగా పడిపోయాయి.

ఇలా ఏ సినిమా వచ్చినా కానీ ఆదివారం వరకే దాని ప్రభావం వుంటోంది. అందరితో శభాష్‌ అనిపించుకునే సినిమాలొస్తే అర్జున్‌రెడ్డి, ఫిదా మాదిరిగా అవే ఆడేస్తాయి. లేదంటే ఫస్ట్‌ వీకెండ్‌ అయ్యేలోగా బ్లాక్‌బస్టర్‌ పోస్టర్లు వేసుకుని, బాలేదన్న వాళ్ల మీద ఛాలెంజ్‌లు చేసుకోవాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు