గాసిప్‌: అఖిల్‌ మళ్లీ వేలు పెడుతున్నాడా?

గాసిప్‌: అఖిల్‌ మళ్లీ వేలు పెడుతున్నాడా?

అఖిల్‌ అక్కినేనికి అనుభవం లేకుండానే అన్ని విషయాల్లో కలగ చేసుకుంటున్నాడనే విమర్శలు అప్పట్లోనే బాగా వినిపించాయి. వినాయక్‌ లాంటి అనుభవజ్ఞుడైన దర్శకుడిని పెట్టుకున్నా కానీ అతనిపై అన్ని బాధ్యతలు వదిలేయకుండా తనే నిర్ణయాలు తీసుకున్నాడు. అఖిల్‌ చిత్రానికి కథ సరిగ్గా లేదని అందరూ భావిస్తే అదే కావాలని పట్టుబట్టి చేసాడు.

అది డిజాస్టర్‌ అవడంతో రెండో సినిమా సెట్‌ చేయడానికి నాగార్జునకి చాలా సమయం పట్టింది. మనం తీసిన విక్రమ్‌ కుమార్‌తో హలో చిత్రాన్ని పట్టాలెక్కిస్తే ఇందులో కూడా అఖిల్‌ జోక్యం ఎక్కువగా వుందని పుకార్లు వినిపిస్తున్నాయి. పాటలు ఓకే చేయడం దగ్గర్నుంచి ఫైట్లు ఎలా వుండాలనే దాని వరకు అన్నిట్లో అఖిల్‌ సలహాలు ఇస్తున్నాడట.

ఒక విజన్‌తో పని చేసే విక్రమ్‌ కుమార్‌కి ఇది నచ్చడం లేదని, ఇప్పటికే నాగార్జునకి కంప్లయింట్‌ కూడా చేసాడని పుకార్లు వినిపిస్తున్నాయి. డిసెంబర్‌ 22న విడుదల చేయడానికి నాగార్జున ఫిక్స్‌ చేయడంతో హలో పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే అఖిల్‌ తన పని తాను చేయకుండా మిగతా వాటిలో వేళ్లు పెట్టడం వల్ల జాప్యం జరుగుతోందని, దీని వల్ల ప్రాజెక్ట్‌ అవుట్‌పుట్‌పై ప్రభావం పడవచ్చునని కూడా చెవులు కొరుక్కుంటున్నారు. ఇది నిజమే అయితే కనుక ఇకపై అఖిల్‌తో పని చేయడానికి పెద్ద దర్శకులు జంకుతారేమో కదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు