సాహోలో ఆ సీనొక్కటే పాతిక కోట్లు

సాహోలో ఆ సీనొక్కటే పాతిక కోట్లు

సాహో చిత్రాన్ని ఆషామాషీగా తీయరాదని యువి క్రియేషన్స్‌ డిసైడ్‌ అయింది. బాహుబలి సినిమా కోసం ఆర్కా మీడియా ఎలాగైతే వెనకా ముందు ఆలోచించకుండా ఖర్చు పెట్టి చరిత్రలో నిలిచిపోయే సినిమా తీసిందో, దానికి ఏమాత్రం తీసిపోని స్టయిలిష్‌ సినిమాని ప్రభాస్‌కి ఇవ్వాలని యువి సంస్థ డిసైడయింది. అందుకే ఈ చిత్రానికి బడ్జెట్‌ పెంచుకుంటూ పోయింది.

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ చిత్రం వర్ధమాన చిత్రాల్లో ఒక సంచలనమయ్యేలా వుండాలని ప్లాన్‌ చేసారు. దర్శకుడు సుజిత్‌కి పెద్ద సినిమా తీసిన అనుభవం లేకపోయినా కానీ అతనిపై నూట యాభై కోట్ల ప్రాజెక్ట్‌ బాధ్యతని మోపారు. యాక్షన్‌ సీన్లు హాలీవుడ్‌కి ఏమాత్రం తీసిపోకుండా తీయడానికి సుజిత్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. ఇందులో ఇరవై నిమిషాల పాటు సాగే ఒక ఛేజ్‌ సీక్వెన్స్‌ని హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్‌తో చేయిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్స్‌కి పని చేసిన నిపుణులు దీనికి వర్క్‌ చేస్తున్నారు.

ఈ సీన్‌ కోసమే పాతిక కోట్లకి పైగా ఖర్చు పెడుతున్నారట. పాతిక కోట్లంటే ఏ మీడియం రేంజ్‌ హీరోతో అయినా ఒక భారీ బడ్జెట్‌ సినిమా తీసేయవచ్చు. చిన్న సినిమాలైతే ఏడెనిమిది తీసేసుకోవచ్చు. అంతెందుకు యువి సంస్థ శర్వానంద్‌తో తీసిన ఎక్స్‌ప్రెస్‌ రాజా, మహానుభావుడు రెండిటి బడ్జెట్‌ కలిపి పాతిక కోట్లు వుండదు. దీనిని బట్టి ఒక సీన్‌కే ఎంత ఖర్చు పెడుతున్నారో అర్థం చేసుకోండిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English