పవన్, బాలయ్యల్ని ‘టచ్’ చేస్తాడట

పవన్, బాలయ్యల్ని ‘టచ్’ చేస్తాడట

2018 సంక్రాంతి సినిమాల దోబూచులాట కొనసాగుతోంది. ఈ సీజన్లో బరిలోకి దిగుతాయంటూ దాదాపు అరడజను సినిమాల గురించి ప్రచారం జరిగింది. ఐతే ‘భరత్ అను నేను’.. ‘రంగస్థలం’ సినిమాలు రేసు నుంచి తప్పుకున్నాయి. ప్రస్తుతానికి పవన్-త్రివిక్రమ్‌ల ‘అజ్నాతవాసి’.. బాలయ్య-కె.ఎస్.రవికుమార్‌ల ‘జై సింహా’ మాత్రమే సంక్రాంతికి పక్కా అంటున్నారు.

ఐతే రాజ్ తరుణ్ ‘రాజు గాడు’.. అనుష్క ‘భాగమతి’ కూడా సంక్రాంతికి రావచ్చంటూ ప్రచారం జరిగింది. కానీ వాటి విషయంలో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఐతే ఇంతలో మరో సినిమా సంక్రాంతి రేసులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఇటీవలే ‘రాజా ది గ్రేట్’తో పలకరించిన మాస్ రాజా రవితేజ.. తన కొత్త సినిమా ‘టచ్ చేసి చూడు’ను సంక్రాంతి రేసులో నిలబెడుతున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రం ‘రాజా ది గ్రేట్’ కంటే ముందు మొదలైంది. కానీ కొన్ని కారణాల వల్ల కొన్నాళ్లు ఈ సినిమాను పక్కన పెట్టి ‘రాజా ది గ్రేట్’ను పూర్తి చేశాడు మాస్ రాజా. ఈ సినిమా విడుదలయ్యాక మళ్లీ ‘టచ్ చేసి చూడు’ మీద ఫోకస్ పెట్టాడు.

విరామం లేకుండా షూటింగ్‌లో పాల్గొని ఈ ఏడాది ఆఖరుకల్లా సినిమాను రెడీ చేసి కుదిరితే సంక్రాంతికి రిలీజ్ చేయించాలని భావిస్తున్నాడట రవితేజ. విక్రమ్ సిరి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాత. రాశి ఖన్నా, సీరత్ కపూర్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు