ఆ టాటూ మార్చవా నయన్?

ఆ టాటూ మార్చవా నయన్?

సౌత్ బ్యూటీ నయనతార.. ఎప్పటికప్పుడు కెరీర్ లో కొత్త శిఖరాలను అందుకుంటూనే ఉంటుంది. పర్సనల్ లైఫ్ లో ఎదురుదెబ్బలు తగిలితే.. వాటిని లెక్క చేయకుండా కెరీర్ ని మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేసేస్తోంది.

ప్రస్తుతం శివ కార్తికేయన్ తో కలిసి వేలైక్కారన్ మూవీ చేస్తోంది నయనతార. కొన్ని వారాల క్రితం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన రాగా.. ఇప్పుడీ మూవీలోంచి నయన్ కు చెందిన ఓ సూపర్బ్ స్టిల్ ను రిలీజ్ చేశారు. వైట్ డ్రెస్ లో నయనతార తెగ మెరిసిపోతోంది. అయితే.. అమ్మడి చేతిపై కనిపిస్తున్న టాటా అసలు సిసలు పాయింట్. PD అనే ఇంగ్లీష్ లెటర్స్ స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అంటే అర్ధం డీటైల్డ్ గా చెప్పాల్సిన పని లేదు. ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నపుడు.. ఇలా పచ్చ పొడిపించుకుంది నయన్.

అయితే.. ఆ తర్వాత ప్రభుదేవాతో కటీఫ్ అయిపోయింది. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్ తో  ప్రేమలో ఉంది నయన్. అఫ్ కోర్స్.. పెళ్లి కూడా అయిపోయిందనే టాక్ ఉంది. అయినా సరే తన చేతిపై కనిపిస్తున్న ట్యాటూను మాత్రం ఇంకా అలాగే కొనసాగిస్తోంది నయనతార. ఇలాంటివాటిని పెద్దగా కేర్ చేసే టైపు కాదు నయన్. ఎవరో ఏదో అనుకుంటారని.. అస్సలే మాత్రం బెదిరిపోని.. గట్స్ గల స్ట్రాంగ్ మహిళ నయనతార.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు