'ఎన్టీఆర్' కోసం రభస జరుగుతుందేమో??

'ఎన్టీఆర్' కోసం రభస జరుగుతుందేమో??

ఏకంగా ఒకటి కాదు రెండు కాదు.. ఇప్పుడు  ఈ యుగపురుషుడిపైన మూడు బయోపిక్ లు తీస్తున్నారు తెలుగు ఫిలింమేకర్లు. ఎవరిష్టం వారిది అన్నట్లు ఎవరికి నచ్చిన అంశాన్ని వారు చెక్కనున్నారు. బాలయ్య అండ్ తేజ ఒక సినిమా, రామ్ గోపాల్ వర్మ  ఒక సినిమా, మరో నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఒక సినిమా తీస్తున్నారు.

ఇప్పటికే వీరందరిపైనా తాను కేస్ పెడతానంటూ లక్ష్మీ పార్వతి వీరికి వార్నింగులు ఇస్తున్నా కూడా.. బాలయ్య అండ్ వర్మ ఎవరి పనుల్లో వారు దూసుకుపోతున్నారు. అయితే బాలయ్య తీసే సినిమాకే అన్ని బయోపిక్స్ లోకి కాస్త అథెంటిసిటీ ఎక్కువగా ఉందని అనుకోవచ్చు. ఇప్పుడు ఆ సినిమా కోసం సాయి కొర్రపాటి 'ఎన్టీఆర్' అంటూ ఒక టైటిల్.. 'నందమూరి ఒక చరిత్ర' అంటూ మరో టైటిల్ రిజిష్టర్ చేయించారట. తన సినిమాకు లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ వర్మ కూడా టైటిల్ పెడుతున్నాడు. మరి ఒకే సమయంలో రెండు ఎన్టీఆర్ లు లీగల్ గా చెల్లినా కూడా.. అసలు బాలయ్య అండ్ కో వర్మను ఆ టైటిల్ వాడనిస్తారా అంటూ ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గతంలో మనం చాలామంది హీరోలు టైటిల్ మొదట్లో ఏదన్నా సఫిక్స్ తగలించి సినిమా టైటిళ్ళను వాడుకోవడం చూశాం. ఇప్పుడు కూడా అదే తరహాలో ఎన్టఆర్ అందరి సొత్తుగా మారిపోతాడా? లేదంటే నైతికంగా ఆలోచించి వర్మ వెనక్కి తగ్గుతాడా? ఎంతైనా పెద్దాయనపై బాలయ్య చేసే సినిమాకే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కదా!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు