చేతిలో ఉన్నాయిగా.. ఈ గ్లామరసం ఏల?

చేతిలో ఉన్నాయిగా.. ఈ గ్లామరసం ఏల?

చేతిలో సినిమాలు ఏవీ లేనప్పుడు చాలామంది హీరోయిన్లు ఏం చేస్తారు చెప్పండి? అబ్బే ఏముందండీ.. హాటు హాటుగా ఒక ఫోటో షూట్ చేస్తారు. లేదంటే చాలా హాటు లుక్కుల్లో బయట దర్శనమిస్తారు. బికినీ షూట్ చేయగానే సీరత్ కపూర్ కు.. హాలిడేకు వెళ్ళినప్పుడు బికినీల్లో మెరిసే శ్రేయకు.. ఆ క్రేజ్ కారణంగా ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలిసిందే.

మనం అసలు మ్యాటర్‌లోకి వెళితే, అమెరికా నుండి ఇండియా వచ్చి సినిమాల్లో తన లక్ టెస్ట్ చేసుకుంటున్న అనూ ఎమ్మానుయేల్ ఉంది చూశారూ..  ఈ భామ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. అమ్మడు చక్కగా బట్టలు సర్దేసుకుని పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి షూటింగ్ నిమిత్తం యురోప్ చెక్కేసింది కాని.. నిన్న మాత్రం ఒక ప్రెస్ మీట్లో తన గ్లామరసం మామూలుగా చిందించలేదు. ఆమె చేతిలో ప్రస్తుతం అజ్ఞాతవాసితో పాటుగా నా పేరు సూర్య, నాగచైతన్య సినిమా.. అలా చాలానే ఉన్నాయి. అయినాసరే  ఈ రేంజులో ఆరబోత ఎందుకంటారు?

నిజానికి ఇప్పుడు హీరోయిన్ల మధ్యన కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అందుకే ఎవరైతే ప్రమోషన్లను కూడా గ్లామర్ డోస్ తో హడలెత్తిస్తారో.. వారికే ఎక్కువగా ఛాన్సులు ఇస్తున్నారు మనోళ్ళు.  అప్పట్లో సమంత కూడా అత్తారింటికి దారేది ఆడియో ఫంక్షన్ లో నాభి అందాలను ఆరబోయలేదూ!! ఆ తరహాలోనే ఇప్పుడు అను కూడా అనుకరిస్తున్నట్లుంది.