రజనీకాంత్‌ బాంబ్‌ అనుకున్నట్టే అక్కడ పడింది

రజనీకాంత్‌ బాంబ్‌ అనుకున్నట్టే అక్కడ పడింది

రోబో సీక్వెల్‌గా ఇప్పుడు ఎక్కడ చూసినా హల్‌చల్‌ చేస్తోన్న '2పాయింట్‌ఓ' జనవరి 25న వస్తుందని అనుకున్నారు. కానీ సమ్మర్‌కి కానీ రిలీజ్‌ అవదని తాజా సమాచారం. తమిళ న్యూ ఇయర్‌ అయిన ఏప్రిల్‌ 13న ఈ చిత్రం రిలీజ్‌ అవుతుందని అనధికారంగా బయటకి వచ్చింది. దీంతో జనవరి 25 డేట్‌ని అక్షయ్‌కుమార్‌ సినిమా పద్మన్‌కి బుక్‌ చేసుకున్నారు.

2పాయింట్‌ఓ వెనక్కి వెళ్లడం జనవరిలో విడుదలయ్యే సినిమాలకి ఊరటనిస్తే, సమ్మర్‌ చిత్రాలపై మాత్రం బాంబ్‌ పడింది. రంగస్థలం, భరత్‌ అనే నేను, నా పేరు సూర్య చిత్రాలు సమ్మర్‌కి ప్లాన్‌ చేసుకున్నారు. ఇప్పుడు రజనీకాంత్‌ సినిమా వచ్చి పడడంతో ఆ సినిమాల రిలీజ్‌ డేట్స్‌ అన్నీ షఫుల్‌ అవుతాయి. 2.0కి ఎంత దూరం మెయింటైన్‌ చేయాలనేది ఇప్పుడే చెప్పడం కష్టం.

బాహుబలి చిత్రానికి ఇచ్చినట్టుగా పూర్తిగా నెల రోజుల సమయాన్ని ఇచ్చేయాలంటే మిగతా వారి సినిమాలు క్లాష్‌ అవుతాయి. ఖలేజా చిత్రాన్ని రోబోకి పోటీగా విడుదల చేస్తే అప్పట్లో క్రష్‌ అయిపోయింది. ఆ అనుభవాన్ని దృష్టిలో వుంచుకుని 2పాయింట్‌ఓకి ఎదురు వెళ్లడానికి ఎవరూ సాహసించరు. ఇంకా శంకర్‌ దీనిని అఫీషియల్‌ చేయలేదు కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం అందరూ అలర్ట్‌ అవుతారు.