ఆ డైరెక్టర్‌ చెయ్యి పడితే ఎక్కడికో

ఆ డైరెక్టర్‌ చెయ్యి పడితే ఎక్కడికో

ఎ.ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకుడిగా సక్సెస్‌ కాలేదు కానీ అతని సినిమాల్లో నటించిన హీరోయిన్లకి మాత్రం జాతకాలు మారిపోతుంటాయి. జ్యోతికృష్ణ డైరెక్షన్‌లో నటించిన తర్వాతే త్రిష టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది.

అతని సినిమా ఫ్లాప్‌ అయినా కానీ ఆ సినిమా తర్వాత త్రిష జాతకం మారిపోయింది. అలాగే తమన్నా, ఇలియానా కూడా అతని 'కెడి' సినిమాలో నటించిన తర్వాత వెనుదిరిగి చూడలేదు. అతని చిత్రం వారికి కలిసి రాలేదు కానీ అతను సైన్‌ చేసుకున్న తర్వాత వాళ్లు టాప్‌ హీరోయిన్లు అయిపోయారు.

మళ్లీ ఆక్సిజన్‌ సినిమాలో అను ఎమాన్యుయేల్‌ని తీసుకున్నాడు. ఆ సినిమా నిర్మాణ దశలో వుండగానే మజ్నులో నటించిన అను సరాసరి త్రివిక్రమ్‌ దృష్టిలో పడింది. ఏకంగా పవన్‌కళ్యాణ్‌ సరసన ఛాన్స్‌ కొట్టేసింది. దాని వెంటనే అల్లు అర్జున్‌తో నటించే అవకాశం వచ్చేసింది. ఇంకా ఆక్సిజన్‌ విడుదల కాలేదు కానీ అను మాత్రం ఆల్రెడీ టాప్‌ హీరోయిన్‌ అయ్యే దిశగా సాగిపోతోంది.

జ్యోతికృష్ణ హ్యాండ్‌ అతని తండ్రికి గానీ, తమ్ముడు రవికృష్ణకి కానీ కలిసి రాలేదు. అదే అతను సైన్‌ చేసిన హీరోయిన్లు మాత్రం స్టార్స్‌ అయిపోతుంటారు. ఈ విషయం పసిగడితే యువ హీరోయిన్లంతా అతని దర్శకత్వంలో నటించడానికి బారులు తీరిపోతారేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు