నాని నుంచి శర్వానంద్‌కి షిఫ్ట్‌

నాని నుంచి శర్వానంద్‌కి షిఫ్ట్‌

నానితో 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' తీసిన హను రాఘవపూడి అతనితోనే మరో చిత్రానికి శ్రీకారం చుట్టాలని చూసాడు. 'లై' రిలీజ్‌కి ముందే ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయింది. నాని కూడా హనుతో తదుపరి చిత్రం చేస్తున్నానని ప్రకటించేసాడు. అయితే లై డిజాస్టర్‌ అవడంతో నాని మనసు మార్చుకున్నాడు. హను సినిమాని పక్కనపెట్టి వేరే చిత్రాలు పట్టాలెక్కించాడు. దీంతో హను వేరే హీరోలని వెతుక్కున్నాడు.

నాని తర్వాత ఆ రేంజ్‌ హీరోల్లో శర్వానంద్‌ సేఫ్‌ బెట్‌ అనిపించుకున్నాడు కనుక అతనికే ఆ కథ చెప్పాడు. తనకి డైరెక్టర్లు చెప్పిన కథకే తప్ప వారి ట్రాక్‌ రికార్డ్‌కి శర్వానంద్‌ అంతగా ప్రాధాన్యత ఇవ్వడు. హను చెప్పిన కథ నచ్చడంతో అతను ఈ చిత్రాన్నే ముందుగా చేయబోతున్నాడని, ఇతర కమిట్‌మెంట్స్‌ అన్నీ పక్కన పెట్టాడని సమాచారం.

లై అంతటి డిజాస్టర్‌ అయినా కానీ హను మరీ అంత తీసికట్టు సినిమాయేం తీయలేదు. కాకపోతే రిలీజ్‌ టైమింగ్‌ బ్యాడ్‌ అవడం వల్ల, దీనికి పోటీగా వచ్చిన రెండు సినిమాలు మాస్‌ని ఆకట్టుకోవడం వల్ల లై గట్టెక్కలేకపోయింది. అయినప్పటికీ అంతటి డిజాస్టర్‌ తర్వాత మళ్లీ హను కోలుకుంటాడా అని అంతా అనుకున్నారు. ఇలా శర్వానంద్‌ రూపంలో అతనికి అదృష్టం కలిసి వచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు