ఆ ముగ్గురి బయోపిక్స్ తీయాలంటున్న తేజ

ఆ ముగ్గురి బయోపిక్స్ తీయాలంటున్న తేజ

తెలుగులో ఇప్పుడో బయోపిక్ గురించి విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆ బయోపిక్ నందమూరి తారకరామారావుదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన జీవిత చరిత్ర నేపథ్యంలో ఒకటికి మూడు సినిమాలకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో ఆయనే ఎన్టీఆర్ పాత్రను పోషిస్తూ చేయబోయే సినిమాకు దర్శకుడిగా ఎంపికయ్యాడు తేజ.

ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ధ్రువీకరిస్తూ.. ఎన్టీఆర్ జీవిత కథను తెరకెక్కించాల్సిన ప్రాధాన్యాన్ని వివరించాడు తేజ. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంకో ఇద్దరు వ్యక్తుల జీవితాల్ని కూడా తెరపైకి తేవాలని అభిప్రాయపడ్డాడు తేజ.

‘‘తెలుగు వారిలో ఎవరిదైనా జీవిత చరిత్రను సినిమాగా తీయాలనుకుంటే.. మొదట ఎన్టీ రామారావు గారిదే తీయాలి అని నేను ముందు నుంచి అనుకునేవాడిని. నా అభిమాన నటుడాయన. సైకిల్ మీద పాల బిందెలు కట్టుకుని తిరిగి.. వెండితెరతో పాటు రాష్ట్రాన్ని కూడా ఏలిన వ్యక్తి.. దేశ రాజకీయాల్ని ప్రభావితం వ్యక్తి ఆయన. ఈ మధ్యనే బాలకృష్ణ పిలిచి ఆ ప్రాజెక్టు నాకు అప్పగించారు.

ఎన్టీఆర్ జీవిత కథతో పాటు ఇంకో ఇద్దరి జీవితాల్ని తెరమీదికి తేవాలని నా అభిప్రాయం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితాన్ని కూడా సినిమాగా మలచవచ్చు. ఇక పత్రికాధిపతిగా.. వాణిజ్యవేత్తగా రామోజీరావు గారు ఎదిగిన క్రమం ఎంతో స్ఫూర్తి దాయకం. మా సినిమా వాళ్లకు ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియోను అందించారాయన. ఆయన జీవితాన్ని కూడా సినిమాగా తీయాలి’’ అని తేజ అభిప్రాయపడ్డాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు