రేవంత్ కాంగ్రెస్‌లో చేరే షెడ్యూల్ ఖ‌రారైందిగా

రేవంత్ కాంగ్రెస్‌లో చేరే షెడ్యూల్ ఖ‌రారైందిగా

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి త‌న త‌దుప‌రి అడుగుల‌పై వ‌డివ‌డిగా సిద్ధ‌మ‌వుతున్నారు. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన కొడంగల్‌లో తన మద్దతుదారులతో రేవంత్ సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా త‌న వెంట ఉన్న కార్య‌క‌ర్త‌ల‌కు ఆయ‌న కృతజ్ఞ‌త‌లు తెలిపారు. అయితే అంత‌కు ముందు ఆయ‌న త‌న స‌న్నిహితుల‌తో స‌మావేశం సంద‌ర్భంగా సంద‌ర్భంగా త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీ గురించి చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో పాటు, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి తన పీఏను ఇప్పటికే ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని తన నివాసాన్ని కూడా నెల రోజులలోగా ఖాళీ చేయనున్నట్లు చెప్పారు. మ‌రోవైపు సోమ‌వారం స్పీక‌ర్‌ను క‌లిసి రాజీనామా లేఖ అందించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఆ త‌దుప‌రి ఆయ‌న కీల‌క అడుగు ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇదిలాఉండ‌గా..టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్, కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారైంది.

పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరేందుకు ప్లాన్ సిద్ధమయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాహుల్ తో రెండు సార్లు భేటీ అయిన రేవంత్.. కాంగ్రెస్ గూటికి చేరేందుకు అంతా రెడీ చేసుకున్నారు. మంగ‌ళ‌వారం ఆయన కాంగ్రెస్ ఉపాథ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటారని స‌మాచారం. భారీ సంఖ్యలో తరలిరానున్న అనుచరులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి.. ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు