మహేష్ వెర్సస్ బన్నీ.. అతడి వివరణ

మహేష్ వెర్సస్ బన్నీ.. అతడి వివరణ

వచ్చే ఏడాది వేసవిలో రిలీజయ్యే సినిమాలకు సంబంధించి ఇప్పుడే రగడ మొదలైపోయింది. ఏప్రిల్ 27కు అల్లు అర్జున్ సినిమా ‘నా పేరు సూర్య’ షెడ్యూల్ అయిందని తెలిసి కూడా మహేష్ బాబు మూవీ ‘భరత్ అను నేను’ను కూడా అదే తేదీకి షెడ్యూల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటించడం టాలీవుడ్లో చర్చనీయాంశమవుతోంది.

ఐతే మహేష్ సినిమా రిలీజ్ డేట్ కన్ఫమ్ చేశారు కాబట్టి ‘నా పేరు సూర్య’ ఏమైనా వెనక్కి తగ్గుతుందేమో అనుకుంటే అలాంటిదేమీ లేదని నిన్ననే తేల్చేశాడు ఆ చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అల్లు అర్జున్ స్నేహితుడు బన్నీ వాసు. ఈ విషయమై ఓ ఇంటర్వ్యూలో అతను వివరణ ఇచ్చాడు.

‘‘భరత్ అను నేను నిర్మాత డీవీవీ దానయ్య గారు మాకు ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే కూర్చుని మాట్లాడుకుని రిలీజ్ డేట్లు ఫైనలైజ్ చేసుకునేవాళ్లం. ‘నా పేరు సూర్య’ రిలీజ్ డేట్‌ను మేం చాన్నాళ్ల కిందటే అనౌన్స్ చేశాం. మీడియాలో కూడా దీని గురించి వార్తలొచ్చాయి. పైగా ఏప్రిల్ 27 అంటే ‘ఖుషి’ సినిమా రిలీజైన డేట్. మెగా ఫ్యామిలీకి కొంచెం సెంటిమెంటుంది. దానయ్య గారు మాతో ఒక్కసారి మాట్లాడాల్సింది.

ఇప్పుడు మేం వెనక్కి తగ్గలేం. ఇలాంటిది ఇండస్ట్రీలో ఎప్పుడూ జరగలేదు. ‘జులాయి’ సినిమా విడుదలకు సిద్ధమైనపుడు ‘ఈగ’ సినిమాకు ఖాళీ ఉండాలని ఆ చిత్రాన్ని మూడు వారాలు వాయిదా వేశారు. ఒక మంచి సినిమా కోసం అలా చేశారు. అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి’’ అని బన్నీ వాసు తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు