దిల్ రాజు స్టెప్పేసిన వేళ..

దిల్ రాజు స్టెప్పేసిన వేళ..

దిల్ రాజు తీరు పెద్ద మనిషి తరహాలో ఉంటుంది. వేదికల మీద చాలా గంభీరంగా కనిపిస్తాడు. గట్టిగా నవ్వుతాడు కానీ.. మిగతా విషయాల్లో గంభీరంగానే ఉంటాడు. అలాంటి వాడు.. ఓ థియేటర్లో జనాల మధ్య స్టెప్పేస్తే ఎలా ఉంటుంది? ‘రాజా ది గ్రేట్’ సక్సెస్ టూర్లో భాగంగా విజయవాడలోని అప్సర థియేటర్లో అదే చేశాడు రాజు. ఆయన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో హైలైట్ అయిన ‘గున్న గున్న మామిడి’ పాటకు డ్యాన్స్ చేయడం విశేషం.

ప్రేక్షకుల కోరిక మేరకు ఈ చిత్ర బృందమంతా ఈ పాటకు డ్యాన్స్ చేసింది. ముందుగా దర్శకుడు అనిల్ రావిపూడినే డ్యాన్స్ చేయడం విశేషం. ఓ అమ్మాయితో కలిసి డ్యాన్స్ అదరగొట్టేశాడు అనిల్. తర్వాత రవితేజ జాయినయ్యాడు. శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా వాళ్లకు తోడయ్యారు. వీళ్లందరూ కలిసి దిల్ రాజును కూడా లాగేశారు. ఆయన కూడా సరదా డ్యాన్స్ చేసి అలరించాడు.

‘రాజా ది గ్రేట్’ ఓ మోస్తరు టాక్‌తోనే మంచి వసూళ్లు సాధించింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.30 కోట్ల దాకా షేర్ సాధిస్తుండటం విశేషం. వారం రోజులకే షేర్ రూ.25 కోట్ల మార్కును టచ్ చేసింది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమాకు తొలి వారంలో అంచనాలకు మించి వసూళ్లు వచ్చాయి. ఐతే అమెరికాలో మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు