ఈ పాటలు.. ఒక్కసారింటే అర్ధంకావ్

ఈ పాటలు.. ఒక్కసారింటే అర్ధంకావ్

ఒకప్పుడు ఏఆర్ రెహ్మాన్ పాటలు ఒకసారి వింటే చాలు.. మతిపోయేది. వెంటనే వాటికి అభిమానులం అయిపోయేవాళ్ళం. అప్పట్లో అందుకే రెహ్మాన్ పాటలు వస్తున్నాయంటే చాలు.. తెలుగోళ్ళు వెంటనే ఆయన కంపోజ్ చేసిన హిందీ సినిమాల పాటల క్యాసెట్లను కూడా కొనేశేవారు. కాని ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. ఎందుకో ఈ ఆస్కార్ విన్నర్ పాటలు ఒక్కసారింటే అస్సలు అర్ధమేకావట్లేదు.

ఇదిగో ఇప్పుడు కొత్తగా 2 పాయింట్ ఓ అల్బమ్ వచ్చింది. అందులో కేవలం రెండే పాటలు ఉన్నాయంట. ఆ పాటల తెలుగు వర్షన్ వింటే మాత్రం.. అసలు ఇవేం పాటలు నాయనా అన్నట్లే ఉన్నాయి. పైగా రెహ్మాన్ కొట్టే ఎలక్ర్టానిక్ టెక్నో మ్యూజిక్ అంతా కూడానూ.. మనం 'ఐ' సినిమాలో 'ఓకే బంగారం' సినిమాలో వినీవినీ బోర్ కొట్టేసింది. అవే బీట్లు. అవే రిథమ్స్. అవే పెర్క్కూషన్లు బోర్ కొట్టిస్తున్నాయి. ఈ రజనీకాంత్ సినిమా పాటలు అందుకు తీసిపోవులే. అసలు పాటల ట్యూన్ అర్ధంకావడానికి మన బుర్రలోకి ఎక్కడానికి చాలా టైమ్ పడుతుంది.

ఇక ఈ పాటల్లోని లిరిక్స్ మరో డిఫరెంట్ రేంజులో ఉన్నాయి అంతే. అసలు అవి తెలుగేనా అనే సందేహం వచ్చే రేంజులో ఉన్నాయి. ''యంతర లోకపు సుందరివే.. అంకెల కవితలు సందుదివే.. దతత తరకత రత తరతత.. నా వైఫ్ వైఫే నువ్వే '' ఇలా సాగే లిరిక్ ను అర్ధం చేసుకోవడం కాస్త కష్టమే. అనంతశ్రీరామ్ రాసిన యంతర లోకపు సుందరివే పాట లిరిక్స్ ఇలా ఉన్నాయ్. 'రండాలి రండాలి.. నువ్వు నేనే నాకే నువ్వు నిండాలి'' అంటూ అర్ధంపర్ధం లేని పదాల కాంబినేషనతో భాస్కరభట్ల రాసిన రెండో పాట లిరిక్స్ కూడా అలాగే ఉన్నాయి.

అవి పూర్తిగా గ్రాంధికమైన తెలుగు కాదు.. అలాగని పూర్తి స్థాయి గద్యభాగానికి చెందిన తెలుగు కాదు. తెగులు పట్టిన తమిళవాసనల తెలుగు అది. అందుకే ఆ పాటలోని పదాలను వాటికి చెందిన అర్ధాలని మనం ఎప్పటికీ అర్దంచేసుకోలేని ఆబ్‌స్టాక్ట్ ఆర్ట్ తరహాలో చూడాలి తప్పిస్తే.. విని అర్ధంచేసేసుకుని పాడేసుకుందాం అంటే కాస్త కష్టమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు