కంగనను కాదు.. మనోడ్ని చూడండి

కంగనను కాదు.. మనోడ్ని చూడండి

ట్యాలెంటెడ్ దర్శకుడు అనిపించుకున్న క్రిష్.. ఇప్పుడు బాలీవుడ్ లో ఓ ప్రెస్టీజియస్ మూవీ డైరెక్షన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ హీరోయిన్ గా రూపొందుతున్న మణికర్ణిక మూవీ షూటింగ్ స్పాట్ నుంచి ఇప్పుడు కొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. మణికర్ణికగా కంగన గెటప్ లీక్ కాకుండా.. కేవలం షూటింగ్ లొకేషన్ కు సంబంధించిన పిక్స్ మాత్రమే లీక్ అవడంలో.. అర్ధం ఏంటో ఈజీగానే తెలుస్తుంది.

అయితే.. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం కంగన గురించి కాదు. క్రిష్ రూపురేఖలు ఎలా మార్చేసుకున్నాడో గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక సినిమాలో నటించడం కోసం క్రిష్ ఇలా గెటప్ ఛేంజ్ చేసుకుంటున్నాడు. టాలీవుడ్ లో ప్రెస్టీజియస్ గా రూపొందుతోన్న సావిత్రి బయోపిక్ లో.. మాయాబజార్ దర్శకుడు కేవీ రెడ్డి పాత్రలో మెరవనున్నాడు క్రిష్. సావిత్రి లైఫ్ కి ఆ సినిమా చాలా ప్లస్ కాబట్టి.. కేవీ రెడ్డి పాత్ర కూడా సినిమాలో కీలకంగానే కనిపించనుంది.

ఆ కేవీ రెడ్డి పాత్రలో ఒదిగిపోయేందుకు గాను.. అచ్చు అలాగే ఉండేలా తన గెటప్ ను మార్చుకుంటున్నాడు క్రిష్. నెత్తిన ఉన్న టోపీ పక్కనెట్టేస్తే.. ఆ మీసకట్టు.. మారిన ముఖకవళికలు చూస్తుంటే.. కేవీరెడ్డి పాత్రలో నటుడిగా కనిపించేందుకు ఈ దర్శకుడు ఎంతగా కసరత్తులు చేసేస్తున్నాడనే సంగతి అర్ధమవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు