తమ్మూ.. చివరకి ఇలా డ్యాన్సులేసుకుంటోంది

తమ్మూ.. చివరకి ఇలా డ్యాన్సులేసుకుంటోంది

మిల్కీ బ్యూటీ తమన్నా చేతిలో ఇప్పుడు అసలు సినిమాలే లేవనే మాట వాస్తవమే. ఈ ఏడాది బాహుబలి2 లాంటి ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లో నటించినా.. కనిపించిన సంతృప్తి మినహా మరేమీ మిగల్లేదు. ఆ తర్వాత కూడా అమ్మడికి అంతగా ఆఫర్సేమీ రాలేదు. వచ్చిన చిన్నాచితకా వాటిని ఒప్పేసుకుని తన స్థాయిని దిగజార్చుకోలేదు కాలేదు కాబట్టి.. సినిమాలు లేని తమన్నా.. సైలెంట్ అయిపోయింది.

ఇప్పుడు అనుకోకుండా ఓ అదిరిపోయే ఈవెంట్ లో మెరిసిపోయింది తమన్నా. రజనీకాంత్ సినిమా 2.ఓ కోసం దుబాయ్ లో ఆడియో లాంఛ్ నిర్వహిస్తుండగా.. ఇక్కడ సడెన్ గా రోబో టైపులో దర్శనం ఇచ్చి డ్యాన్సులు వేసేసింది తమ్ము. ప్రస్తుతం తమన్నా ఉన్న పరిస్థితికి ఇది చాలా పెద్ద అవకాశమే. ఇలా రజనీకాంత్ సినిమా ఆడియో లాంచ్ కోసం.. డ్యాన్సులు కూడా వేసేయగలగడం గొప్ప విషయమే.

కానీ పాపం తమన్నా గతంలో వెలిగిన రేంజ్ తో పోల్చితే.. ఇలా సినిమా ఆడియో ఫంక్షన్స్ లో డ్యాన్సులు వేసుకుంటున్న తరుణాన్ని తలచుకుంటే మాత్రం ఒకింత ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. అయితే.. ఎప్పుడు ఏ విషయం ఎందుకు కలిసొస్తుందో చెప్పలేం. ఇలాంటి ప్రెస్టీజియస్ ఈవెంట్ లో కనిపించే ఛాన్స్ ను వదులుకుని.. తర్వాత తీరిగ్గా బాధపడే బదులు.. దీని ద్వారా వచ్చే క్రేజ్ ను ఉపయోగించుకుని ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలనే థాట్ తమన్నాకు ఉందని టాక్. అదీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English