2.0 నిర్మాతల సెగలు మామూలుగా లేవే..

2.0 నిర్మాతల సెగలు మామూలుగా లేవే..

రూ.450 కోట్ల ఖర్చుతో ‘2.0’ సినిమా అంటే ఏంటో అనుకున్నారు కానీ.. ‘2.0’ ఆడియో వేడుక సందర్భంగా ఆ చిత్ర నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్సన్స్’ వాళ్ల హడావుడి చూస్తుంటే వీళ్లు మామూలోళ్లు కాదు అనిపిస్తోంది. ఇంతకుముందు లాస్ ఏంజెల్స్‌లోని హాలీవుడ్ వద్ద ‘2.0’ కోసం భారీ స్థాయిలో ఎయిర్ బెలూన్ ఎగరేయించి సంచలనం సృష్టించారు ‘2.0’ నిర్మాతలు.

ఇప్పుడు దుబాయిలో ‘2.0’ ఆడియో వేడుకను పురస్కరించుకుని 10 వేల అడుగుల ఎత్తులో ‘2.0’ పోస్టర్‌నే ప్యారాచూట్ లాగా పెట్టించి అక్కడి నుంచి ముగ్గురు స్కై డైవర్ల విన్యాసాలు చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోను చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాజు మహాలింగం ట్విట్టర్లో షేర్ చేశాడు.

ఇక ఈ రోజు రాత్రి జరగబోయే ‘2.0’ ఆడియో వేడుక కోసం మొత్తంగా రూ.15 కోట్లు ఖర్చు పెడుతోంది ‘లైకా ప్రొడక్షన్స్’. కేవలం ఆడియో వేడుక దగ్గర ఏర్పాటు చేసిన రెండు ఎల్ఈడీ స్క్రీన్లకే రూ.2 కోట్లు ఖర్చు చేశారట. నిన్న ప్రెస్ మీట్ కోసం ఎక్కడెక్కడి నుంచో రిపోర్టర్లను సొంత విమాన ఖర్చులతో రప్పించారట.

మొత్తంగా ఈ ప్రెస్ మీట్ కోసమే రూ.కోటి దాకా ఖర్చయిందట. మొత్తానికి ‘2.0’ సినిమాకు మాత్రమే కాక.. ప్రచార కార్యక్రమాలకు కూడా కనీ వినీ ఎరుగని రీతిలో ఖర్చు చేసి ఆశ్చర్యపరుస్తున్నారు నిర్మాతలు. ప్రమోషన్లకే ఇంత హంగామా ఉంటే.. ఇక సినిమాలో ఇంకెంత భారీతనం ఉంటుందో అంచనా వేయొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు