నేనా? త్రివిక్రమ్ సినిమాలోనా?!

 నేనా? త్రివిక్రమ్ సినిమాలోనా?!

సిసింద్రీ తెరంగేట్రం గురించి ఇటీవల ఊహాగానాలు ఊపందుకున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో అఖిల్ త్వరలోనే తెరకు పరిచయమవుతున్నాడనీ... అందుకు సంబంధించి ప్రస్తుతం కథ సిద్ధం అవుతోందనీ ప్రచారం సాగింది. నాగార్జున కూడా ఆ కథకు ఓకే చేశారనీ, త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళుతుందని కూడా అన్నారు. ఇప్పుడు అదంతా ఉత్తిదేననీ తేలిపోయింది. స్వయంగా అఖిలే ముందుకొచ్చి `నేను త్రివిక్రమ్ తో సినిమా చేయడం లేదు` అని ప్రకటించారు. అసలు ఇప్పటిదాకా ఎలాంటి కథా నేను వినలేదని చెప్పుకొచ్చాడు. త్రివిక్రమ్ తో సినిమా అన్నది ఒట్టి పుకారే అని అఖిల్ వెల్లడించారు.

``ఒకవేళ నాకోసం నిజంగా ఆయన కథ సిద్ధం చేస్తే మాత్రం నటించడానికి నేను సిద్ధమే. అయితే అందుకు సంబంధించి మా మధ్య ఎలాంటి డిస్కషన్స్ జరగలేదు. నేను ఏదైనా సినిమా ఒప్పుకుంటే తప్పకుండా చెబుతాను`` అని అఖిల్ ట్వీట్ చేశారు. త్రివిక్రమ్ ఇప్పటికీ తన తదుపరి సినిమా గురించి నిర్ణయం తీసుకోలేదు. దీంతో అఖిల్ తోనే తదుపరి సినిమా ఉంటుందని అందరూ ఊహించారు. కానీ అఖిల్ ప్రకటనతో అందులో వాస్తవం లేదని తేలిపోయింది. అయితే ఇప్పుడు అఖిల్ ని తెరపైకి తీసుకొచ్చే బాధ్యతను నాగార్జున ఎవరికి అప్పగిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు