తమన్ బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చాడే..

తమన్ బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చాడే..

సౌత్ సినిమాలకు పని చేస్తూ, ఇక్కడ బాగా అలవాటు పడ్డ నటీనటులు, సాంకేతిక నిపుణులు బాలీవుడ్‌కు వెళ్లడానికి అంతగా ఇష్టపడరు. అక్కడి నుంచి అవకాశాలు వచ్చినా లైట్ తీసుకుంటారు. ఐతే తమన్ మాత్రం తనకు బాలీవుడ్ సినిమాలో పని చేసే అవకాశం రాగానే సంతోషంగా అంగీకరించాడు. ‘గోల్ మాల్’ సిరీస్‌లో తెరకెక్కిన నాలుగో భాగానికి తమన్ సంగీతం అందించాడు. అతడికి ఈ సినిమా మంచి పేరే తెచ్చిపెడుతోంది. గత వారం విడుదలైన ‘గోల్ మాల్ అగైన్’ అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది.

ఆరు రోజులకే ఈ సినిమా ఇండియా వరకే రూ.126 కోట్లు వసూలు చేయడం విశేషం. తొలి రోజే రూ.30.14 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు రూ.28.37 కోట్లు కొల్లగొట్టింది. మూడో రోజు రూ.29.09 కోట్లు వచ్చాయి. నాలుగో రోజుకే వంద కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన ఈ చిత్రం వీకెండ్ తర్వాత కూడా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. బుధవారం కూడా ఈ సినిమాకు రూ.10 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఈ వారాంతంలోనూ ‘గోల్ మాల్ అగైన్’ హవా కొనసాగుతుందని భావిస్తున్నారు.

ఓవర్సీస్‌లో ‘గోల్ మాల్ అగైన్’ ఇప్పటికే 4 మిలియన్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఓవరాల్‌గా ఈ సినిమా వసూళ్లు రూ.150 కోట్ల మార్కును దాటేశాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో భారీ సినిమాలు బోల్తా కొట్టడంతో బాలీవుడ్ బాగా వెనుకబడిపోయింది. కానీ ద్వితీయార్ధంలో ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’.. ‘జుడ్వా-2’.. ఇప్పుడు ‘గోల్ మాల్ అగైన్’ అదిరిపోయే వసూళ్లు సాధించి బాలీవుడ్లో ఉత్సాహం నింపాయి. ఇక సంగీత దర్శకుడిగా బాలీవుడ్లో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్.. మున్ముందు అక్కడ మంచి అవకాశాలు అందుకునే ఛాన్సుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English