2.0 తమిళ సినిమా కాదు - శంకర్

2.0 తమిళ సినిమా కాదు - శంకర్

‘2.0’ తమిళ సినిమా కాదన్నాడు దర్శకుడు శంకర్. ఇది ఇండియన్ ఫిలిం అని.. రిలీజ్ తర్వాత దేశవ్యాప్తంగా అందరూ ఇది మా సినిమా అని గొప్పగా చెప్పుకుంటారని శంకర్ వ్యాఖ్యానించాడు. ‘2.0’లో ‘రోబో’ పాత్రలు తప్ప.. కథ విషయంలో ‘2.0’కు దానికి ఏ పోలికలూ ఉండవని శంకర్ స్పష్టం చేశాడు. ‘‘2.0 ఒక యూనివర్శల్ ఫిల్మ్. రోబోకు కొనసాగింపుగా ‘2.0’ తెరకెక్కలేదు.

దీన్ని ఓ కొత్త కథతో, కొత్త ఫార్మాట్‌తో.. ఓ మంచి సందేశంతో రూపొందించాం. అయితే ‘రోబో’లోని పాత్రలు మాత్రం ఇందులో ఉంటాయి. అవి మరోసారి ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఇందులోని  సందేశం ప్రపంచవ్యాప్తంగా అందరికీ కనెక్టవుతుంది. అందరినీ ఆలోచింపజేస్తుంది. ఈ సినిమా ఏ హాలీవుడ్ చిత్రానికీ కాపీ కాదు. కానీ హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది’’ అన్నాడు శంకర్.

‘2.0’ కోసం హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్‌ను సంప్రదించిన మాట వాస్తవమే అని శంకర్ తెలిపాడు. ‘2.0’ సార్వజనీనమైన కథతో తెరకెక్కిందని.. ఆర్నాల్డ్ ఈ సినిమాలో నటిస్తే ఇది ప్రపంచవ్యాప్తంగా మరింతగా రీచ్ అవుతుందన్న ఉద్దేశంతో విలన్ పాత్ర కోసం ఆయన్ని సంప్రదించామని శంకర్ తెలిపాడు.

ఆర్నాల్డ్‌కు ‘2.0’ కథ కూడా నచ్చిందని.. ఆయన మేనేజర్లతో పలుమార్లు సంప్రదింపులు జరిపామని.. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన నటించలేకపోవడంతో ఆ పాత్రకు అక్షయ్ కుమార్‌ను తీసుకున్నామని శంకర్ అన్నాడు. అక్షయ్ విలన్ పాత్రలో అద్భుత అభినయం చూపించాడని శంకర్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు