సౌత్ సినిమాలపై చీప్ కామెంట్స్

సౌత్ సినిమాలపై చీప్ కామెంట్స్

దక్షిణాదిన ఈ ఏడాదే తెలుగులో.. తమిళంలో ‘బిగ్ బాస్’ షోలు మొదలయ్యాయి. అవి విజయవంతంగా నడిచాయి. కానీ హిందీలో ‘బిగ్ బాస్’ సీజన్ ఏమంత ఆకర్షణీయంగా లేదంటూ జనాలు తిట్టిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ షోకు పబ్లిసిటీ పెంచడానికి వివాదాలు రాజేసే ప్రయత్నంలో ఉన్నారు అక్కడి నిర్వాహకులు.

మరి వాళ్ల సూచన మేరకే మాట్లాడిందో లేక తనంతట తానే వ్యాఖ్యలు చేసిందో తెలియదు కానీ.. హిందీ సీరియళ్లతో ఫేమస్ అయి ‘బిగ్ బాస్’ 11వ సీజన్లో పార్టిసిపెంటుగా ఎంపికైన హీనా ఖాన్.. సౌత్ సినిమా గురించి చీప్ కామెంట్స్ చేసింది బిగ్ బాస్ హౌస్‌‌లో.

సౌత్ సినిమాల్లో హీరోయిన్ల డ్యాన్సులు చాలా జుగుప్సా కరంగా ఉంటాయట.. ఇక్కడ ఎలా పడితే అలా బాడీని ఊపాలట.. బొద్దుగా లేకుంటే ఇక్కడి వాళ్లకు ఆనదట.. ఇలా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసింది హీనా ఖాన్. ఆమె ఇలా సౌత్ సినిమాల గురించి మాట్లాడుతుంటే మిగతా హౌస్ మేట్స్ కూడా ఆమెకు వంత పాడారు. హీనా తనకు సౌత్ నుంచి ఒకటికి రెండు పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చినట్లు తెలిపింది.

అవి రెండూ కూడా చాలా పెద్ద సంస్థల నుంచి వచ్చిన ఆఫర్లట. కానీ ఆమె వాటిని తిరస్కరించిందట. పేరెత్తలేదు కానీ.. ఆ సినిమాల్లో ఒకటి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అన్నట్లు హింట్ ఇచ్చింది హీనా. తాను వదులుకున్న సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్ హీరోలని.. ఈ సినిమా చేయలేనందుకు మాత్రం చింతిస్తున్నానని చెప్పింది హీనా. ఈ సినిమా విషయంలో మహేష్, వెంకీ అభిమానుల మధ్య చాలా గొడవలు జరిగిపోయినట్లు కూడా వ్యాఖ్యానించింది హీనా. ఆమె వ్యాఖ్యలపై హన్సిక లాంటి సౌత్ హీరోయిన్లు కొందరు ఘాటుగా స్పందించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు