షూటింగ్ స్పాట్లో యాగాలు చేయించాడట

షూటింగ్ స్పాట్లో యాగాలు చేయించాడట

దయ్యం సినిమాలు చేయడం అంత ఈజీ కాదంటున్నాడు సిద్దార్థ్. తాను హీరోగా నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘గృహం’ సినిమా షూటింగ్ సందర్భంగా ఆ ఇబ్బందులేంటో తనకు తెలిసొచ్చాయని అతనన్నాడు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా యూనిట్ సభ్యులు చాలా భయపడ్డారని.. వారి కోసం యజ్నాలు, యాగాలు చేయించాల్సిన పరిస్థితి తలెత్తిందని సిద్దార్థ్ వెల్లడించాడు.

‘గృహం’ సినిమా షూటింగ్ చాలా వరకు హిమాచల్ ప్రదేశ్‌లో చేశామని.. అక్కడి మంచు వాతావరణం హార్రర్‌ను గ్లోరిఫై చేయడానికి ఉపయోగపడుతుందని భావించామని సిద్ధు చెప్పాడు. మామూలుగా తన గురువు మణిరత్నం మంచుతో రొమాన్స్‌ను ఎలివేట్ చేస్తారని.. ఐతే తాము పొగమంచుతో హార్రర్‌ను ఎలివేట్ చేయాలనుకున్నామని.. ఇందుకోసం హిమాచల్‌ ప్రదేశ్‌లోని కొండ ప్రాంతంలో మెజారిటీ షూటింగ్ చేశామని సిద్ధు చెప్పాడు.

ఐతే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా పై నుంచి తన మీద ఒక వస్తువు పడిందని.. దీంతో అందరూ అది దయ్యం పనే అని భయపడటం మొదలుపెట్టారని.. రాత్రి పూట షూటింగ్ స్పాట్లో కాపలా కోసం ఒక వాచ్ మ్యాన్‌ను పెడితే.. అతను రోజూ అక్కడ ఉండటానికి భయపడ్డాడని సిద్ధు తెలిపాడు. దీంతో యూనిట్ సభ్యుల బలవంతం మేరకు తాను ఒక పూజారిని పిలిపించి యజ్నాలు, యాగాలు చేయించాల్సి వచ్చిందని, దాని వల్ల నిర్మాతగా తనకు అదనంగా ఖర్చయిందని చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు