ఈ ఒక్క హీరోయే ఎందుకు రియాక్ట్ అయ్యాడు?

ఈ ఒక్క హీరోయే ఎందుకు రియాక్ట్ అయ్యాడు?

మెర్సాల్ సినిమా లేవనెత్తిన కాంట్రోవర్శీకి తమిళనాట పెద్ద రచ్చే జరిగింది. అయితే  సినిమాను తెలుగు వర్షన్ రిలీజ్ అయ్యాక అసలు సినిమాలో ఏముందో చూసి కామెంట్ చేద్దాంలే అని మనోళ్ళు అందరూ సైలెంట్ గానే ఉన్నారు. కాని మంచు విష్ణు మాత్రం ఒక న్యూస్ డిబేట్ లో సినిమావాళ్లకు బ్రెయిన్ లేదు అంటూ కామెంట్ చేసిన బిజెపి అధికార ప్రతినిధిపై నిప్పులు చెరిగాడు. అయితే ట్విట్టర్ సాక్షిగా ఇతనొక్కడే ఎందుకు స్పందించాడు?

ప్రస్తుతం ఫిలిం నగర్లో విష్ణు స్పందనపై  ఒక టాక్ వినబడుతోంది. మనోడు అమెరికాలో ఆచారి అమెరికా యాత్ర సినిమా చేస్తూనే.. మరో ప్రక్కన అడ్డా మూవీ ఫేం కార్తిక్ రెడ్డి డైరక్షన్లో ఓటర్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా రాజకీయనాయకులను టార్గెట్ చేస్తూ అనేక డైలాగులు సీన్లు ఉన్నాయట. ఇక తన సినిమా రిలీజైనప్పుడు మాత్రమే పాలిటిక్స్ గురించి మాట్లాడి.. ఇప్పుడు మాట్టాడకపోతే.. జనాలు తప్పుగా అనుకుంటారు కాబట్టి.. అసలు అలాంటి సమస్యలపై ముందే రియాక్ట్ అయితే బెటరంటూ మంచు విష్ణు స్పందించాడని కొందరు అంటున్నారు.

అవునులేండి.. తన సినిమాలు రిలీజైనప్పుడు మాత్రమే రాజమౌళి ఎన్నారైలు పైరసీ చూస్తున్నారు.. దానిని అరికట్టాలి.. అంటూ కామెంట్స్ చేసి.. ఇతర సినిమాల విషయంలో మాత్రం అలాంటివి పట్టించుకోడు అనే అపవాదు ఉండనే ఉంది. బహుశా అలాంటివి చూసి విష్ణు కూడా జాగ్రత్తపడ్డాడేమో.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు