మహేష్‌కి ఏ బెంగా లేదు

మహేష్‌కి ఏ బెంగా లేదు

స్పైడర్‌ చిత్రానికి దాదాపు అరవై శాతం నష్టాలు వచ్చాయని ట్రేడ్‌ చెబుతోంది. రికవరీ చాలా దారుణంగా వుండడంతో మహేష్‌కి ఇది వరుసగా రెండో డబుల్‌ డిజాస్టర్‌ అయింది. మహేష్‌ సినిమాల్లోనే కాకుండా హిస్టరీలోనే వన్‌ ఆఫ్‌ ది బిగ్గెస్ట్‌ డిజాస్టర్స్‌గా స్పైడర్‌ నిలిచింది. అయితే బ్రహ్మూెత్సవం, స్పైడర్‌ చిత్రాల ఫలితాలని మహేష్‌ అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదు.

ఈ రెండు చిత్రాలకీ దర్శకుల తప్పిదాలే కారణం తప్ప మహేష్‌ చేసిందేమీ లేదు. దర్శకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా తీసిన ప్రతిసారీ మహేష్‌ తన సత్తా చాటుకున్నాడు. మహేష్‌ తదుపరి చిత్రాలు రెండిటికీ మినిమం గ్యారెంటీ దర్శకులే పని చేస్తున్నారు. కొరటాల శివకి మాస్‌ పల్స్‌ బాగా తెలుసు. అతను ఎప్పుడూ కూడా తన సినిమాలని తేలిగ్గా తీసుకోడు. రైటర్‌గా, డైరెక్టర్‌గా అతని ట్రాక్‌ రికార్డ్‌ అమోఘం. కనుక 'భరత్‌ అనే నేను' సినిమా విషయంలో మహేష్‌కి బెంగ అక్కర్లేదు.

ఇక ఆ తర్వాతి సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకుడు. మున్నా మినహాయిస్తే మిగతా మూడూ వంశీ కేపబులిటీ తెలియజేసాయి. దానికి తోడు నిర్మాతగా దిల్‌ రాజు వుండడంతో అతను తీసుకునే కేర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాబోయే రెండు చిత్రాల విషయంలో మహేష్‌కి చింత లేదు కనుక ఈ రెండు డబుల్‌ డిజాస్టర్స్‌ పెయిన్‌ని త్వరగానే మర్చిపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు