మెర్సాల్ లాజిక్ లో పాయింట్ ఉందా?

మెర్సాల్ లాజిక్ లో పాయింట్ ఉందా?

ఇప్పుడు మెర్సాల్ సినిమా లేపిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎందుకంటే  సినిమాలో జి.ఎస్.టి గురించి విజయ్ కామెంట్ చేశాడనగానే.. బిజెపి వాళ్ళు దానికి మామూలు మైలేజ్ ఇవ్వలేదు అనుకోండి. అయితే ఈ సినిమాలో అసలు విజయ్ చేసిన కామెంట్స్ లో పాయింట్ ఉందా అనేది ఇప్పుడు నిధానంగా ఆలోచిస్తున్నారు జనాలు.

నిజానికి సింగపూర్ లో 7% జిఎస్.టి. ఉన్నా కూడా వారు అద్భుతమైన మెడికల్ సౌకర్యాలు కల్పిస్తున్నారని.. కాని ఇండియాలో 18% జి.ఎస్.టి ఉండి కూడా ప్రభుత్వం విఫలం అవుతోంది అన్న చందాన విజయ్ లాజికల్ గా డైలాగ్ చెప్పాడు.  ఆ క్షణాన సదరు డైలాగు బాగా పేలింది కాని.. వాస్తవంగా చూసుకుంటే.. అసలు మన దేశంలో ఈ ట్యాక్స్ వచ్చింది మొన్ననేకదా.. అప్పుడే ఇండియా ఆ ట్యాక్స్ డబ్బులతో వైద్య సదుపాయాలు సౌకర్యాలు ఎలా పెట్టేస్తుంది?

పైగా సింగపూర్ లో ఎప్పటినుండో అందరూ సంపాదించే డబ్బుపై ట్యాక్సు కట్టయ్యి మిగతాది చేతకొస్తుంది. కాని మన దేశంలో ఇంకా అన్ని రంగాల్లోనూ అది కరక్టుగా అమల్లో లేదు. సాఫ్టువేర్ ఇండస్ర్టీ వంటి కొందరే సక్రమంగా ట్యాక్సులు కడుతున్నారు. నెలకి లక్షల్లో సంపాదించే పచారి కొట్లు ఇంకా ట్యాక్సులు సరిగ్గా చెల్లిస్తున్న దాఖలాలే లేవు. సింగపూర్ లో ట్యాక్సులు బాగున్నాయి కాబట్టి.. పైగా ఓవరాల్ దేశం సైజ్ చిన్నది కాబట్టి.. అక్కడ డెవలెప్మంట్ ఈజీ అయిపోయింది. మన దేశంలో.. తక్కువ ఏరియాలో ఏకంగా 120 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అందుకే డెవలెప్మంట్ కనిపించడం అంత సులభం కానే కాదు.

అసలు.. శంకర్ చెప్పినట్లు ముందు అవినీతిని ఏరిపారేస్తేనే.. ఈ ట్యాక్సుల తాలూకు రిజల్ట్ కనిపిస్తుంది. అది జరగకుండా కేవలం ట్యాక్సు మీద పడి ఏడిస్తే మాత్రం పెద్దగా ఒరిగిదేం ఉండదు. మరి మెర్సాల్ సినిమా డైలాగులో లాజిక్ ఉందో మిస్సయ్యిందో మీరే ఆలోచించండి.

రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ సపోర్టు ఇచ్చింది..  ఈ డైలాగ్ కోసం అయ్యుండదు.. అక్కడ సినిమాలో మెడికల్ వ్యవస్థలో డబ్బు దోపిడి ఎలా ఉందో చూపించారు కదా.. దాని గురించే. సో ఆ లెజెండ్స్ ఇద్దరూ సినిమా సూపర్బ్ అన్నారు అంటే.. అది బిజెపి పార్టీని టార్గెట్ చేశారని కూడా అనుకోవక్కర్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు