బాలీవుడ్‌ 'బాహుబలి'తో ఆమె ఏం చేస్తోంది?

బాలీవుడ్‌ 'బాహుబలి'తో ఆమె ఏం చేస్తోంది?

బాహుబలి చిత్రాన్ని కనుక హిందీలో తీసినట్టయితే టైటిల్‌ రోల్‌కి యాప్ట్‌ అయ్యేవాడు హృతిక్‌ రోషన్‌ ఒక్కడే. హాండ్‌సమ్‌ హంక్‌ అని పిలిపించుకునే అన్ని అర్హతలున్న హృతిక్‌ నలభైవ వడిలో పడినా కానీ ఇంకా చాలా ఫిట్‌గా, అందంగా వున్నాడు. అతడితో నటించాలనే ప్రతి హీరోయిన్‌ కల. మన తమన్నాకి కూడా హృతిక్‌ అంటే పిచ్చి.

అందుకే అతనితో ఫోటో తీసుకునే అవకాశం రాగానే వెంటనే దానిని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా, ఆ ఆనందాన్ని సగటు ఫాన్‌ గాళ్‌లా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. హృతిక్‌ కూడా ఆమెని కలవడం ఆనందకరమని ట్వీట్‌ చేసాడు. వీళ్లిద్దరి ఫోటో ముచ్చట ఫాన్స్‌కి సంతోషాన్ని ఇచ్చిన సంగతి పక్కన పెడితే అసలు ఇప్పుడు తమన్నా పట్టుబట్టి హృతిక్‌ని ఎందుకు కలిసినట్టు? బాహుబలి తర్వాత తమన్నా కెరియర్‌ ఆశించిన స్థాయిలో పైకి సాగలేదు.

ప్రస్తుతానికి ఆమె కళ్యాణ్‌రామ్‌, సందీప్‌ కిషన్‌ లాంటి చిన్న హీరోలతోనే సినిమాలు చేస్తోంది. దక్షిణాదిలో చెప్పుకోతగ్గ ఆఫర్లు లేకపోవడంతో ఉత్తరాదిలో పెద్ద సినిమాలు సాధించే ఉద్దేశంతో తమన్నా స్వయంగా అవకాశాలని వెతుక్కుంటోందని సమాచారం. ఆ క్రమంలో భాగంగానే తమన్నా వెళ్లి హృతిక్‌ని కలిసిందా లేక అనుకోకుండా ఎదురు పడిన హృతిక్‌తో ఒక ఫోటో దిగేందుకు సరదా పడిందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు