‘రాజా ది గ్రేట్’ మిస్సవడంపై రామ్...

‘రాజా ది గ్రేట్’ మిస్సవడంపై రామ్...

ఒక కథ ఎవరి దగ్గరికో వెళ్తుంది. కానీ చివరికి ఇంకెవరో హీరోగా తెరకెక్కుతుంది. అలా తారుమారైన సినిమా ‘రాజా ది గ్రేట్’. ఈ కథ ముందు యువ కథానాయకుడు రామ్ దగ్గరికి వెళ్లింది. ఐతే ‘నేను శైలజ’తో హిట్టు కొట్టి ఊపుమీదున్న రామ్.. ఈ సినిమా చేసేందుకు ఎక్కువ పారితోషకం పారితోషకం అడగడంతో దిల్ రాజు అతడిని పక్కన పెట్టేసినట్లుగా వార్తలొచ్చాయి అప్పట్లో.

ఆ తర్వాత ఎన్టీఆర్ దగ్గరికి కూడా ‘రాజా ది గ్రేట్’ కథ వెళ్లింది. ఐతే అతడితోనూ వర్కవుట్ కాలేదు. చివరికి రవితేజ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కమర్షియల్‌గా ఈ సినిమా మంచి ఫలితాన్నే అందుకుంది.

మరి ఈ సినిమాను మిస్సయినందుకు రామ్ ఎలా ఫీలవుతున్నాడిప్పుడు? ఈ ప్రశ్నే అతడి ముందు ఉంచితే.. ‘‘కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయాను. కానీ అన్నీ అనుకున్నట్లు జరగవు కదా. అలా ఆ ప్రాజెక్టు కుదరలేదు. ఐతే ఒక సినిమా చేయలేకపోయానని బాధపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకసారి కాదనుకున్నాక దాని గురించి అస్సలు ఆలోచించను.

అన్నీ ఆలోచించాకే కథను రిజెక్ట్ చేస్తాం కాబట్టి రిగ్రెట్స్ ఏమీ ఉండవు’’ అని రామ్ అన్నాడు. ఇక తన కొత్త సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’ గురించి రామ్ మాట్లాడుతూ.. ‘‘హైపర్ తర్వాత ఏదైనా డిఫరెంట్ స్టోరీ చేద్దామనుకుంటున్న సమయంలో ఈ కథ విన్నా. వినగానే వెంటనే ఒప్పుకున్నా. స్నేహం మీద ప్రధానంగా నడిచే కథ ఇది. సినిమాలో అదే కీలకమైన పాయింట్. మధ్యలో లవ్ స్టోరీ యాడ్ అవుతుంది. బాల్యం, యవ్వనం, మెచ్యూర్డ్ ఏజ్.. ఇలా మూడు దశలో కథ సాగుతుంది’’ అని రామ్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు