‘ఎన్టీఆర్’ కంటే ముందు ఆ లెజెడ్ సినిమా

‘ఎన్టీఆర్’ కంటే ముందు ఆ లెజెడ్ సినిమా

ఓవైపు నందమూరి బాలకృష్ణ-తేజ కాంబినేషన్లో ఎన్టీఆర్ మీద ఓ సినిమా తీసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. మరోవైపు రామ్ గోపాల్ వర్మ మరో యాంగిల్లో ఎన్టీఆర్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. వీళ్లింకా ఈ సన్నాహాల్లో ఉండగానే.. మరోవైపు తమిళనాట ఎన్టీఆర్ లాగే సినీ రంగంలో శిఖరాన్నందుకుని, రాజకీయ రంగంలోనూ గొప్ప స్థాయికి చేరుకున్న లెజెండ్ ఎంజీఆర్ జీవిత కథత సినిమా చేయడానికి రంగం సిద్ధమైపోయింది.

నవంబరు 8న ఎంజీఆర్ బయోపిక్ ప్రారంభోత్సవం కూడా జరుపుకోబోతోంది. సీనియర్ దర్శకుడు బాలకృష్ణన్ ఈ చిత్రాన్ని రూపొందించచోతున్నాడు.

ఎంజీఆర్ పాత్ర కోసం ఎంచుకున్న నటుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నాడు. ‘బాహుబలి’లో కట్టప్పగా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన సీనియర్ నటుడు సత్యరాజ్ ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్ర పోషించనున్నాడట. అనేకమంది నటీనటుల పేర్లు పరిశీలించి చివరికి సత్యరాజ్ అయితే ఎంజీఆర్ పాత్రకు పర్ఫెక్టుగా ఉంటాడని ఫిక్సయింది చిత్ర బృందం.

ఐతే లుక్ సంగతేమో కానీ.. ఎంజీఆర్ కంటే పొడవుగా ఉండటం సత్యరాజ్‌కు ఉన్న మైనస్. అయితే తన నటనతో సత్యరాజ్ ఆ మైనస్‌ను కవర్ చేయగలడని భావిస్తున్నారు. ఈ సినిమాకు అన్నాడీఎంకే పార్టీ ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందట.