త్రిష షాకింగ్ డెసిషన్

త్రిష షాకింగ్ డెసిషన్

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష సంచలన నిర్ణయం తీసుకుంది. ఓ క్రేజీ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది. స్వయంగా ఆమే ఈ విషయాన్ని తన ట్విట్టర్ పేజీలో ప్రకటించింది. 14 ఏళ్ల కిందట తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ‘సామి’కి సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విక్రమ్ హీరోగా హరి రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు చోటుంది.

‘సామి’లో కథానాయికగా నటించిన త్రిషతో పాటు కీర్తి సురేష్‌ కూడా ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఐతే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నానని.. ‘సామి-2’ టీంకు ఆల్ ద బెస్ట్ అని సింపుల్ గా ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టి అందరికీ పెద్ద షాకిచ్చింది త్రిష.

14 ఏళ్ల కిందట వచ్చిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తీయడం.. అప్పటి కథానాయికనే మళ్లీ రిపీట్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇలాంటి అవకాశాన్ని త్రిష వదులుకోవడం మరింత ఆశ్చర్యకరమైన విషయం. బహుశా ఇప్పుడు ఊపుమీదున్న కీర్తికి మెయిన్ హీరోయిన్‌ గా తీసుకుని.. త్రిష పాత్రను పరిమితం చేసి ఉండొచ్చని.. అందుకే ఆమె తప్పుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.

‘సామి’ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ‘పడయప్పా’ (తెలుగులో ‘నరసింహా’) పేరిట ఉన్న రికార్డులను కూడా బద్దలు కొట్టేసింది. అప్పుడే కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న త్రిష ఈ సినిమాతో భారీ విజయాన్నందుకుని స్టార్ స్టేటస్ సంపాదించింది. ‘సామి’ తెలుగు రీమేక్ ‘లక్ష్మీనరసింహా’ కూడా బాగానే ఆడింది. నెల కిందటే షూటింగ్ ఆరంభించుకున్న ‘సామి-2’ వచ్చే ఏడాది వేసవికి విడుదలవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు