రెడ్ డ్రెస్సులో రెచ్చిపోయింది

రెడ్ డ్రెస్సులో రెచ్చిపోయింది

టాలీవుడ్లో నెక్స్ట్ బిగ్ హీరోయిన్ అయ్యేందుకు పక్కా ప్రణాళికతోనే సాగుతున్నట్లుంది మలయాళ భామ అను ఇమ్మాన్యుయెల్. మొదట్లో నాని, రాజ్ తరుణ్, గోపీచంద్ లాంటి మీడియం రేంజి హీరోలతోనే నటించిన ఈ భామ.. ఇప్పుడు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి సూపర్ స్టార్ల పక్కన అవకాశాలు పట్టేసిన సంగతి తెలిసిందే.

మరి అంత పెద్ద స్టార్ల పక్కన నటిస్తూ బయట మామూలుగా కనిపిస్తే ఆమె ప్రత్యేకత ఏముంది? అందుకే ‘ఆక్సిజన్’ సినిమా వేడుకకు ఓ రేంజిలో రెడీ అయి వచ్చింది అను. ఈ ఆడియో వేడుకలో అనునే హైలైట్ అంటే అతిశయోక్తి లేదు.

ఓవైపు క్లీవేజ్ అందాల్ని.. మరోవైపు థైస్ సౌందర్యాన్ని చూపిస్తూ ఆమె ధరించిన రెడ్ డ్రెస్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇన్నాళ్లూ అనును ఒక దృష్టితో చూసిన వాళ్లందరూ కూడా తన విషయంలో ఫీలింగ్ మార్చేసుకున్నారు. ఈమెలో ఇంత సెక్స్ అప్పీల్ ఉందా అనుకున్నారు. మొత్తానికి స్టార్ స్టేటస్ సంపాదించడానికి ఏం అవసరమో అను బాగానే అర్థం చేసుకున్నట్లుంది.
పెద్దగా బజ్ లేని ‘ఆక్సిజన్’ సినిమాకు అను స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా ఫలితం సంగతెలా ఉన్నా.. పవన్ కళ్యాణ్, బన్నీ సినిమాల్లో ఏది ఆడినా అను రేంజే మారిపోయే అవకాశముంది. ముందుగా ‘ఆక్సిజన్’ నవంబరు 10న రాబోతోంది. పవన్ సినిమా ‘అజ్నాతవాసి’ వచ్చే జనవరి 10కి, బన్నీ మూవీ ‘నా పేరు సూర్య’ వచ్చే వేసవికి రిలీజవుతాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు