నేనా.. సెక్స్ బాంబా?

నేనా.. సెక్స్ బాంబా?

తనను ‘సెక్స్ బాంబ్’ అని.. ‘సెక్సీ గాళ్’ అని పిలవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తోంది రష్మి గౌతమ్. మిగతా హీరోయిన్లతో పోలిస్తే తాను సినిమాల్లో చేసిన ఎక్స్‌పోజింగ్ తక్కువే అని.. ఆ మాత్రానికే తనకు అలాంటి ట్యాగ్స్ ఇవ్వడం కరెక్ట్ కాదని.. తనను ఆ దృష్టితో చూడొద్దని రష్మి విజ్నప్తి చేసింది.

పాత్ర అవసరాన్ని బట్టే తాను ఎలాంటి దుస్తులైనా ధరిస్తానని.. ‘గుంటూరు టాకీస్’లో పాత్ర అవసరాన్ని బట్టి కొంచెం సెక్సీగా కనిపించానని.. దీంతో తనకు ఒక ముద్ర వేసేశారని రష్మి అంది. ‘గుంటూరు టాకీస్’ తర్వాత తనకు అంత గుర్తింపు ఉన్న పాత్ర ‘నెక్స్ట్ నువ్వే’లోనే దక్కిందని.. ఈ సినిమా అంతటా తాను చీరలోనే కనిపిస్తానని చెప్పింది.

తనకు ఒక ట్యాగ్ రావడం ఇబ్బందిగా మారిందని.. ఐతే అలాగని తాను సిల్క్ స్మిత, జ్యోతిలక్ష్మీ లాంటి వాళ్లు చేసిన పాత్రలు చేయాల్సి వచ్చినా అభ్యంతరం చెప్పనని అంది రష్మి. ఐతే కంటెంట్ ఉంటేనే ఏ పాత్ర అయినా ఒప్పుకుంటానని చెప్పింది. ప్రస్తుతానికి తన చేతిలో వేరే తెలుగు సినిమాలేవీ లేవని.. తమిళంలో మాత్రం ఒక సినిమా చేస్తున్నానని రష్మి వెల్లడించింది.

స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని.. ‘నెక్స్ట్ నువ్వే’ మంచి విజయం సాధించి తనకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నానని రష్మి చెప్పింది. ‘నెక్స్ట్ నువ్వే’లో తాను ప్రేమ.. అసూయ.. కామెడీ మిక్స్ అయిన క్యారెక్టర్ చేస్తున్నట్లు ఆమె తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు