గోపీచంద్ వచ్చాడు.. వాళ్లను పొగిడాడు

గోపీచంద్ వచ్చాడు.. వాళ్లను పొగిడాడు

గోపీచంద్ కొత్త సినిమా ‘ఆక్సిజన్’ ఆడియో వేడుక ఎట్టకేలకు జరిగింది. రెండేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రానికి ఆడియో వేడుక చేయాలని చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ లాగే ఆడియో తేదీని కూడా మళ్లీ మళ్లీ మార్చారు. చివరికి సోమవారం రాత్రి ఈ వేడుకను పూర్తి చేశారు.

దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఎ.ఎం.రత్నంతో హీరో గోపీచంద్‌కు విభేదాలున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో అతను ఈ వేడుకకు రావడమే సందేహంగా మారింది. గోపీ మీద సందేహాల వల్లే ఈ నెల 15న నెల్లూరులో అనుకున్న ఈ వేడుకను 23కు వాయిదా వేయాల్సి వచ్చింది. ఆడియో వేడుక వేదికను కూడా హైదరాబాద్‌కు మార్చాల్సి వచ్చింది.

ఐతే వేడుకకు గోపీచంద్ హాజరై అనుమానాలకు తెరదించాడు. ఈ వేడుకలో మామూలుగానే కనిపించిన గోపీచంద్.. జ్యోతికృష్ణ, రత్నంల గురించి పాజిటివ్‌గానే మాట్లాడాడు. ‘ఆక్సిజన్’ సినిమా చేయడానికి అసలు కారణమే ఎ.ఎం.రత్నం అని గోపీ అన్నాడు. చిన్నప్పట్నుంచి ఆయన్ని చూస్తున్నానని.. తెలుగు సినీ పరిశ్రమలో మంచి అభిరుచితో సినిమాలు నిర్మించిన అతి కొద్ది మంది నిర్మాతల్లో రత్నం ఒకరని చెప్పాడు.

 జ్యోతికృష్ణ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని.. ఐతే రత్నం నిర్మిస్తేనే ఈ సినిమా చేస్తానని తాను షరతు పెట్టానని గోపీ తెలిపాడు. అన్నట్లుగానే ఆయన రాజీ లేకుండా ఈ సినిమాను నిర్మించాడని చెప్పాడు. చాలా కష్టపడి చేసిన సినిమా ఇదని.. ఇందులో కుటుంబ బంధాలు, యాక్షన్ అంశాలతో పాటు మంచి సందేశం కూడా ఉందని.. తమ కష్టానికి కచ్చితంగా మంచి ఫలితం వస్తుందని అన్నాడు గోపీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు