ఆ రాజు వదిలేసిన టైటిల్‌తో ఈ రాజు

ఆ రాజు వదిలేసిన టైటిల్‌తో ఈ రాజు

దశాబ్దం కిందట టాలీవుడ్లో ఎమ్మెస్ రాజు హవా ఎలా ఉండేదో తెలిసిందే. స్టార్ల వెంట పడకుండా కథకే ఓటేస్తూ వరుసగా సూపర్ హిట్లు కొడుతూ గొప్ప పేరు సంపాదించాడు రాజు. అప్పట్లో మహేష్ బాబు హీరోగా ఆయన నిర్మించిన ‘ఒక్కడు’ బ్లాక్ బస్టర్ అయింది. దీని తర్వాత మహేష్ బాబుతో మరో సినిమా చేయాలని అనుకున్నారు రాజు.

ఆ సినిమాకు ‘హరే రామ హరే కృష్ణ’ అనే టైటిల్ కూడా ప్రకటించారు. కానీ ఏం జరగిందో ఏమో ఆ సినిమా తెరమీదికి రాలేదు. ఆ టైటిల్ ఇంకెవరూ వాడుకోలేదు. ఇప్పుడు మహేష్ బాబు సినిమాకే ఈ టైటిల్ వాడుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అప్పుడు ఎమ్మెస్ రాజు వదిలేసిన టైటిల్‌ను ఇప్పుడు దిల్ రాజు తీసుకుంటున్నాడట.

సీనియర్ నిర్మాత అశ్వినీదత్‌తో కలిసి దిల్ రాజు.. మహేష్ బాబు హీరోగా ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి ‘హరే రామ హరే కృష్ణ’ అనే టైటిల్ కన్సిడర్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు ‘జయ కృష్ణా ముకుందా మురారి’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. మొదటి టైటిల్‌కే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ‘భరత్ అను నేను’ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు మహేష్. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వంశీ పైడపల్లి-దిల్ రాజు-అశ్వినీదత్ సినిమాను మహేష్ మొదలుపెట్టే అవకాశముంది. ఈ సినిమా స్క్రిప్టు మీద ఏడాదిన్నరగా పని చేస్తున్నాడు వంశీ పైడిపల్లి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English