'సింహా'నికే ఓటేసిన బాలయ్య

'సింహా'నికే ఓటేసిన బాలయ్య

సెంటిమెంట్లను నమ్మడంలో మన సినిమా ఇండస్ర్టీలో బాలయ్య ప్రథముడు. ఆయన చేసే ప్రతీపనిలోనూ ఈ సెంటిమెంట్ అనేది ధ్వనిస్తుంది. పైగా సెంటిమెంట్ అనేది కూడా మన సంస్కృతిలో భాగం అని ఆయన నమ్ముతుంటారు. అందుకే ఇప్పుడు తన కొత్త సినిమాపై ఆ సెంటిమెంట్ ను దారాళంగా కురిపిస్తున్నారు.

అసలు 'పైసా వసూల్' ఫ్లాప్ అవుతుందని బాలయ్య అనుకోలేదు. ఆ పంచులూ ఆ సెటైర్లు అలాగే కొత్తగా కనిపిస్తున్న తన బాడీ లాంగ్వేజ్ బాగా వర్కవుట్ అవుతుందని అనుకున్నారు. కాని అది ఆడకపోయేసరికి.. కె ఎస్ రవికుమార్ డైరక్షన్లో చేస్తున్న 102వ సినిమాకు అన్నీ సెంటిమెంట్లను అద్దేస్తున్నారు.

ఆల్రెడీ ఈ సినిమాలో తనకు హిట్ సెంటిమెంట్ అయిన నయనతార ఉంది. అలాగే తనకు అచ్చొచ్చేలా ముగ్గురు హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇప్పుడు తనకు ఎంతగానో కలిసిచ్చిన సింహా అనే పదాన్ని పెట్టి.. ''జయ సింహా'' అనే టైటిల్ ను ఈ సినిమాకు ఖరారు చేశారట.

అసలు ఫామ్ లో లేని కె ఎస్ రవికుమార్ తో సినిమా అంటేనే షాకింగ్ గా ఉన్నవేళ.. ఎన్ని సెంటిమెంట్లు ఉంటే ఏం లాభం అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే నయనతార ఉన్నా శ్రీరామరాజ్యం ఉంది.. సింహం ఉన్నా సీమసింహం ఉంది.. అలాగే ముగ్గురు హీరోయిన్లతో ఆయన కొట్టిన ఫ్లాపులు కూడా చాలానే ఉన్నాయి. కాబట్టి కంటెంట్ బాగుండాలని కోరుకుందాం. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English