అనిరుధ్‌ ను బాగా లేపేస్తున్నారే!!

అనిరుధ్‌ ను బాగా లేపేస్తున్నారే!!

ఈరోజు ఉదయం త్రివిక్రమ్ డైరక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా లాంచ్ కార్యక్రమం చాలా గ్రాండుగానే జరిగింది. స్వయంగా పవన్ కళ్యాణ్‌ వచ్చి క్లాప్ కొట్టడం మామూలు ఆసక్తిని క్రియేట్ చేయలేదు అనుకోండి. ఈ సందర్భంగా అక్కడే హడావుడి చేసిన కంపోజర్ అనిరుధ్‌ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు వినిపిస్తున్నాయి.

నిజానికి మొదటి నుండి త్రివిక్రమ్ సినిమాల్లో కత్తిలాంటి మ్యూజిక్ ఉంటుంది. మనోడి టేస్ట్ సాధరణంగానే సూపర్ అనుకుంటే.. ఈయన సినిమాల్లో పాటల కోసం కల్పించే ఆ సన్నివేశాలు కూడా బాగుంటాయి. అయితే మొన్నటివరకు దేవిశ్రీప్రసాద్ తో పనిచేసిన త్రివిక్రమ్.. నిన్న #పీకె25 ఇవాళ #ఎన్టీఆర్28 లకు అనిరుధ్ ను దించాడు. పైగా ఈరోజు లాంచ్ ఈవెంట్లో చూస్తుంటే.. అసలు త్రివిక్రమ్ దగ్గరుండి మరీ ఈ పిల్లాడ్ని ఇది చెయ్ అది చెయ్ అంటూ నడిపిస్తున్నాడు.

దేవిశ్రీప్రసాద్ కాస్త ఎక్కువ పైకం అడగటం వలన అనిరుధ్ ను తెచ్చాడని అనుకుంటారేమో.. ఇప్పుడు దేవి కంటే అనిరుధ్ తీసుకునేదే ఎక్కువ. కాని ఎందుకో మనోడు త్రివిక్రమ్ కు బాగా నచ్చేశాడు. అందుకే ఇతగాడ్ని విపరీతంగా పైకి లేపుతున్నారు అంటున్నారు ఇండస్ర్టీ వర్గాలు.

సర్లేండి సినిమా ఇండస్ర్టీ అంటేనే పర్మినెంట్ ఎంప్లాయిస్ ఎవరూ ఉండరు. ఇక్కడ అందరూ ఫ్రీలాన్స్ వర్కర్లే. కొత్తవారు వస్తుంటారు, పాతవారు మళ్ళీ మెరుస్తుంటారు, కొందరు మిస్సయిపోతూ ఉంటారు. ప్రస్తుతం అనిరుధ్ టైం నుడస్తోంది అనుకోవాలంతే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు