మెగా ప్రాజెక్టు గురించేగా ఈ క్లారిటీ అంతా..

మెగా ప్రాజెక్టు గురించేగా ఈ క్లారిటీ అంతా..

ఇప్పుడు 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాతోనైనా పెద్ద హిట్టు తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. అయితే అమ్మడు ఈ సంవత్సరం ఆల్రెడీ మిష్టర్ అండ్ యుద్దం శరణం సినిమాలతో గట్టి దెబ్బలే తిన్నాక.. ఈ సినిమా ఏం చేస్తుందో అనే టెన్షన్ ఆమె ముఖంలో బాగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఒక విషయంపై క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించింది అందాల రాక్షసి.

నిజానికి గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో పరుశరాం డైరక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న సినిమాలో అమ్మడే హీరోయిన్. కాని ఆ సినిమా నుండి.. అలాగే 100% లవ్ తమిళ రీమేక్ అమ్మడు ఒకేసారి తప్పుకుంది. దీని గురించి చాలా కారణాలు వినిపించాయి. డైరక్టర్ కు ఈమెకూ పడలేదని.. గ్లామర్ డోస్ కుదరదదు అనేసిందని.. ఇలా చాలా విన్నాం. అయితే తనకు లంగావోణి రోల్స్ చేసి చేసి బోర్ కొట్టిందని.. వెస్ర్టన్ గ్లామర్ బట్టల్లో మెరవాలని ఉందని కావాలంటీ బికినీలకు కూడా రెడీ అని చెబుతూ ఆ రూమర్లను పటాపంచలు చేసింది లావణ్య.

అంతేకాదు.. ఇప్పుడు తను చేసిన పాత్ర కూడా ముందు వేరే హీరోయిన్ కు అనుకున్నారని.. కాని ఆఖరి నిమిషంలో డేట్లు కుదరకో వేరే ఒప్పందాల వలన ఆమె వెళిపోతే నేను వచ్చానని.. గతంలో తన విషయంలో కూడా అలాగే జరిగిందని చెప్పింది. అంటే మెగా ప్రాజెక్టు గురించేగా ఈ క్లారిటీ అంతా. అలాగే అనుకోవాలి మరి.

నిజానికి ఉన్నది ఒక్కటే జిందగీ సినిమాలో నితిన్ తో 'లై' సినిమాలో చేసిన మేఘా ఆకాష్ సెకండ్ హీరోయిన్ కాగా.. లై ఫెయిల్యూర్ తరువాత ఆమె ఈ సినిమా నుండి తప్పుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు