సిద్దార్థ్ మిస్సయిన ‘మనం’

సిద్దార్థ్ మిస్సయిన ‘మనం’

మనం.. అక్కినేని కుటుంబానికి ఓ మధుర జ్నాపకంగా నిలిచిపోయిన సినిమా. అక్కినేని కుటుంబానికి సంబంధించిన మూడు తరాల హీరోలు ఒక సినిమాలో నటించడం.. ఆ సినిమా అద్భుతంగా రావడం.. గొప్ప ప్రేక్షకాదరణ పొందడం.. వీటన్నింటికీ మించి ఏఎన్నార్‌కు ఇది చివరి సినిమా కావడంతో దీన్ని చాలా ప్రత్యేకంగా భావిస్తుంది ఆ ఫ్యామిలీ. ఇలాంటి మ్యాజిక్ అన్నిసార్లూ సాధ్యం కాదు. ఈ సినిమా చూస్తే ఇది అక్కినేని ఫ్యామిలీ కోసమే పుట్టిందా అనిపిస్తుంది. ఐతే నిజానికి దర్శకుడు విక్రమ్ కుమార్ ముందు ఈ సినిమాకు అనుకున్నది వేరే హీరోనట. ఆ హీరో మరెవరో కాదు.. ‘బొమ్మరిల్లు’ సహా పలు తెలుగు సినిమాల్లో నటించిన సిద్దార్థ్.

విక్రమ్ ముందుగా ‘మనం’ కథను తీసుకెళ్లి సిద్దార్థ్‌కు చెప్పగా అతడికి నచ్చిందట. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రకు అప్పుడు కె.విశ్వనాథ్‌ను అనుకున్నారట. తర్వాత నాగార్జున చేసిన పాత్రకు విక్టరీ వెంకటేష్ పేరు తెరమీదికి వచ్చిందట. నాగచైతన్య పాత్రను సిద్దార్థ్ చేయాలనుకున్నాడట. కానీ కారణాలేంటో తెలియదు కానీ.. ఈ సినిమా అనుకోకుండా అక్కినేని ఫ్యామిలీ చేతికి వచ్చింది. తన దగ్గరికి ‘మనం’ కథ వచ్చిన విషయాన్ని సిద్దార్థే స్వయంగా తమిళ మీడియాకు వెల్లడించడం విశేషం. సిద్దార్థ్ చేస్తే ఫలితం ఎలా ఉండేదో కానీ.. అక్కినేని కుటుంబంతో చేయడం వల్ల చేకూరిన ప్రత్యేకత మాత్రం దీనికి చేకూరేది కాదన్నది వాస్తవం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు