మాస్ రాజా అంధుడు కాకపోయినా ఆడేసేదే

మాస్ రాజా అంధుడు కాకపోయినా ఆడేసేదే

అసలు తెలుగులో ఇప్పటివరకు ఎప్పుడూ కూడా ఒక టాప్ కమర్షియల్ హీరో అంధుడి పాత్రలో నటించలేదు. ఏదో కామెడీ కోసం కాసినన్ని సీన్లలో అలా నటించారే తప్పించి.. పూర్తి స్థాయిలో సినిమా అంతటా అలా కనిపించలేదు. కొందరికైతే సినిమా సగం అయ్యేలోపు కళ్లొచ్చేస్తాయి. కాని మొదటి నుండి చివర వరకు అంధుడిగా రవితేజ 'రాజా ది గ్రేట్'లో మెప్పించాడు.. అనేదే నిర్మాతల ఫీలింగ్.

ఇది వారి ఫీలింగ్ అయితే.. సినిమాను చూసిన సామాన్యుల ఫీలింగ్ వేరేలా ఉంది. ఎందుకంటే అసలు ఈ సినిమా కథలో హీరో అంధుడు అని పేరుకే గాని.. పంచ్ వేయడం దగ్గర నుండి పల్టీలు కొట్టడం వరకు.. అన్నీ కూడా కమర్షియల్ హీరో కా బాప్ అన్నట్లు చేసేశాడు. స్పీడుగా వెళ్లే ట్రైన్ ను పట్టుకుని ఆ ట్రైన్ పైభాగానికి జంప్ చేయడం.. అసలు కొండల్లో కోనల్లో కూడా సూనాయసంగా నడిచి వెళ్ళిపోవడం.. తనకు స్మయిలీ అంటే వినాయకుడు అనే దేవుడు ఎలా ఉంటాడో తెలియకపోయినా కూడా.. ఆ బొమ్మలన్నీ గోడ మీద గీయించేయడం.. అబ్బో చాలా చేస్తాడు ఈ రాజా. ఈ సినిమాలో ఉన్న కామెడీ.. ఇది రిలీజ్ అయిన హాలీడే సీజన్.. రెండూ చూసుకుంటే మాత్రం.. సినిమాలో అసలు హీరో అంధుడు కాకపోయినా అడేసేదే అంటున్నారు ప్రేక్షకులు.

సర్లేండి.. సినిమాలో ఏ కొత్త కథా లేనప్పుడు.. సినిమాను సేల్ చేయడానికి ఒక పాయింట్ కావాలి. అందుకే ఈ అంధుడు అనే అవలక్షణం ఉపయోగపడింది. వాడకం అంటే ఎలా ఉండాలో మరోసారి ఈ సినిమావాళ్లు రుచి చూపించేశారంతే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు