నితిన్‌కి ఆమెతో లింక్‌ ఏమీ లేదు!

నితిన్‌కి ఆమెతో లింక్‌ ఏమీ లేదు!

ఒక హీరో ఎవరైనా కొత్త హీరోయిన్‌తో వరుసగా మరో చిత్రం చేస్తే ఇక వారిద్దరి మధ్య ఏదో వుందని రాసేయడం మీడియాకి అలవాటే. అందులోను ఫ్లాప్‌ సినిమా హీరోయిన్‌ని ఆ హీరో రిపీట్‌ చేస్తే ఇంకాస్త ఎక్కువగా వదంతులు పుట్టుకొస్తాయి. 'లై' సినిమాలో తనతో నటించిన మేఘా ఆకాష్‌ని తన మలి చిత్రంలో నితిన్‌ హీరోయిన్‌గా తీసుకునే సరికి ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పుకార్లు వ్యాపిస్తున్నాయి.

అయితే లై సినిమాకి అబ్రాడ్‌ షెడ్యూల్‌ పెద్దది వున్నట్టే నితిన్‌ తాజా చిత్రానికి కూడా నలభై రోజుల పాటు అబ్రాడ్‌ షెడ్యూల్‌ వుంది. దీంతో బిజీ హీరోయిన్లు ఎవరూ అన్ని డేట్లు ఇవ్వరు కనుక 'లై' చేస్తున్నప్పుడే మేఘా ఆకాష్‌తో ఒక మాట అనుకున్నారట.

ఆమె కూడా నితిన్‌తో మరో సినిమా కమిట్‌ అయ్యానని ఒక రెండు ఆఫర్లు వదిలేసుకుందట. దీంతో లై ఫ్లాప్‌ అయినా మేఘా ఆకాష్‌ని నితిన్‌ రిపీట్‌ చేస్తున్నాడు. ఇంతకుమించి ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన పనేం లేదంటున్నారు.

గతంలో నిత్యామీనన్‌తో నితిన్‌ వరుసగా సినిమాలు చేసినపుడు ఆమెపై ఆసక్తి చూపిస్తున్నాడని చెవులు కొరుక్కున్నారు. టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌లో ఒకడు కావడంతో నితిన్‌కి ఇలా కొత్త హీరోయిన్‌ వచ్చినపుడల్లా పుకార్ల బెడద తప్పదేమో. మూడు పదుల వయసు దాటినా నితిన్‌ ఎందుకో ఇంకా పెళ్లి ఊసెత్తడం లేదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు