మొగుడు దెబ్బ సరిపోలేదా గోపీ

మొగుడు దెబ్బ సరిపోలేదా గోపీ

గోపీచంద్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ‘మొగుడు’ ఒకటి. అలాగే కృష్ణవంశీ కెరీర్లో ఆ సమయానికి అదే బిగ్గెస్ట్ ఫ్లాప్. ఈ సినిమాతో వీళ్లిద్దరి కెరీర్లో బాగా దెబ్బ తిన్నాయి. దీని తర్వాత ‘లౌక్యం’ మినహాయిస్తే గోపీచంద్‌కు హిట్టు లేదు. ఇక కృష్ణవంశీ పరిస్థితేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చివరగా ఆయన చేసిన ‘నక్షత్రం’ దారుణమైన ఫలితాన్నందుకుంది.

ఐతే ఆశ్చర్యకరంగా ఈ డిజాస్టర్ కాంబో రిపీట్ కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే కృష్ణవంశీ-గోపీచంద్ కాంబినేషన్లో ఓ సినిమా మొదలవుతుందట. వీరిలో ఎవరు ఎవరికి ఛాన్స్ ఇస్తున్నారో.. ఎవరు రిస్క్ చేస్తున్నారో చెప్పడం కష్టమే. ఇద్దరి కెరీర్లో ప్రస్తుతం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. మరి వీరి కాంబినేషన్లో సినిమా తీయడానికి ముందుకొచ్చిన నిర్మాత ఎవరో చూడాలి.

‘నక్షత్రం’ తర్వాత కృష్ణవంశీ సినిమాలు మానేస్తాడేమో అన్న టాక్ నడిచింది. ఆ సినిమా ఆ స్థాయిలో ప్రేక్షకులకు చుక్కలు చూపించింది. ఇక గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘గౌతమ్ నంద’ ఫ్లాపవడం.. ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా రిలీజ్ కాకపోవడం.. ‘ఆక్సిజన్’ కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతుండటం తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయి ఉన్నాడు. మరి వీళ్లిద్దరూ కలిసి చేయబోయే సినిమా ఇద్దరికీ మంచి ఫలితాన్నందిస్తుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు