నిజమా.. ఆ సినిమా బడ్జెట్ 25 కోట్లా?

నిజమా.. ఆ సినిమా బడ్జెట్ 25 కోట్లా?

రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘గరుడవేగ’ సినిమాకు రూ.25 కోట్ల బడ్జెట్ అన్నపుడు అందరూ ఆశ్చర్యపోయారు. రాజశేఖర్ మార్కెట్ ఏంటో తెలిసిందే కాబట్టి అది ఏమాత్రం వర్కవుటయ్యే బడ్జెట్ కాదు. అందుకే జనాలకు నమ్మకం కలగలేదు. ఐతే స్వయంగా రాజశేఖరే తనకు అంత మార్కెట్ లేకపోయినా నిర్మాత ఖర్చు పెట్టాడు అని ఓపెన్ గా చెప్పాక జనాలకు కొంత నమ్మకం కలిగింది.

ఇక ఈ సినిమా టీజర్.. ట్రైలర్ చూశాక రూ.25 కోట్ల బడ్జెట్ అంటే నమ్మశక్యంగానే అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ తెరమీద కనిపించాయి. కానీ ‘వినవయ్యా రామయ్యా’ సినిమాతో హీరోగా పరిచయమైన నాగఅన్వేష్ హీరోగా ఆయన తండ్రి ‘సింధూరపువ్వు’ కృష్ణారెడ్డి ‘ఏంజెల్’ అనే సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే.

కొన్ని నెలల కిందటే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఏంజెల్’ సినిమా బడ్జెట్ రూ.25 కోట్లంటూ ఆ చిత్ర బృందం చెప్పుకుంటుండటం.. మీడియాలో దీని గురించి వార్తలు కూడా వస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయం. రాజశేఖర్ ఎంతైనా ఒకప్పుడు స్టార్. సినిమాలో కంటెంట్ ఉంటో ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చే అవకాశముంది. పైగా సినిమాలో క్వాలిటీ కనిపిస్తోంది కూడా. కానీ ‘ఏంజెల్’ హీరోది ఒక సినిమా అనుభవం. అది కూడా అట్టర్ ఫ్లాప్ మూవీ. పోనీ ఈ సినిమా టీజర్.. ట్రైలర్లలో అంత క్వాలిటీ ఏమైనా కనిపించిందా అంటే అదీ లేదు. ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ టైపులో సినిమా తీసినట్లున్నారు.

గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ కోసం కొంచెం ఖర్చు పెట్టినట్లున్నారు కానీ.. మరీ 25 కోట్ల బడ్జెట్ అంటే ఎంతమాత్రం నమ్మశక్యంగా అనిపించట్లేదు. ఈ సినిమాకు తెలుగులోనే బిజినెస్ కాక విడుదల వాయిదా పడుతుంటే.. దీన్ని తమిళ.. హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తామంటూ చెప్పడం విడ్డూరమే. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు