ఆ పిచ్చి క్రిటిక్‌ను ట్విట్టర్ నుంచి తరిమేశారు

ఆ పిచ్చి క్రిటిక్‌ను ట్విట్టర్ నుంచి తరిమేశారు

కమల్ ఆర్.ఖాన్.. సోషల్ మీడియాలో సినిమాల్ని ఫాలో అయ్యేవాళ్లకు పరిచయం అక్కర్లేని పేరు. హిందీలో ఒకట్రెండు చెత్త సినిమాలు చేసి.. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ల మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేయడం ద్వారా పాపులరయ్యాడు. పనిలో పనిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మోహన్ లాల్ లాంటి సౌత్ సూపర్ స్టార్లను విమర్శించి ఇక్కడా మంచి పబ్లిసిటీనే సంపాదించాడు.
 
కాంట్రవర్శీల ద్వారానే ట్విట్టర్లో ఫాలోవర్లను పెంచుకున్న ఇతగాడిని మన జనాలు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. అతడేదో సౌత్ స్టార్లను ఏదో అంటే ఇగ్నోర్ చేయకుండా.. అతణ్ని తిట్టిపోసి పబ్లిసిటీ, ఫాలోయింగ్ పెంచారు. ఐతే అటు బాలీవుడ్ వాళ్లకు, ఇటు సౌత్ వాళ్లకు తలనొప్పిగా మారిన ఇతణ్ని ట్విట్టర్ నుంచి తరిమేశారు.

కమల్ ఆర్.ఆర్.ఖాన్ ట్విట్టర్ అకౌంట్ మీద నిషేధం పడింది. కారణాలేంటన్నది తెలియదు కానీ.. నిన్నట్నుంచి కమల్ ట్విట్టర్ అకౌంట్ పని చేయడం లేదు. అతడికి ట్విట్టర్లో ఏకంగా 60 లక్షల మంది దాకా ఫాలోవర్లుండటం విశేషం. తన ట్విట్టర్ అకౌంట్ మీద బ్యాన్ పడటానికి అమీర్ ఖానే కారణం అంటున్నాడు కమల్.

అమీర్ నిర్మాణంలో తెరకెక్కిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ సినిమాను తాను నెగెటివ్ రివ్యూ ఇచ్చానని.. అందుకే అక్కసుతో తన మీఅద ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడని అతను ఆరోపించాడు. తన అకౌంట్ సస్పెండ్ చేసినందుకు ట్విట్టర్ మీద తాను కోర్టుకెక్కనున్నట్లు కమల్ చెప్పాడు.

తాను ఎంతో కష్టపడి.. ఎంతో ఖర్చుపెట్టుకుని ట్విట్టర్లో 60 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నానని.. తన అకౌంట్ యాక్టివేట్ చేయడమో లేక.. తనకు నష్టపరిహారం చెల్లించడమో చేయాలని అతను డిమాండ్ చేశాడు. ఐతే తాను ఎంతో ఖర్చు పెట్టుకుని ఇంతమంది ఫాలోవర్లను సంపాదించుకున్నానని కమల్ అనడాన్ని బట్టి చూస్తే అతడికి అంతమంది ఫాలోవర్లుండటంలో ఏదో మతలబు ఉందని అర్థమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English