త్రి'విక్రమ్' త‌ర్వాత 'విక్ర‌మ్ ' తో ఎన్టీఆర్‌!

త్రి'విక్రమ్' త‌ర్వాత 'విక్ర‌మ్ ' తో ఎన్టీఆర్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినేయం చేసిన 'జై లవ కుశ ' హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. జై పాత్ర‌లో ఎన్టీఆర్ న‌ట‌న‌కు సినీ ప్ర‌ముఖుల‌తోపాటు, విమ‌ర్శ‌కుల నుంచి కూడా ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఆ సినిమా స‌క్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రం త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ 25 వ చిత్రం పూర్త‌యిన త‌ర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసేందుకు త్రివిక్ర‌మ్ ఓకే చెప్పాడు.

ఈ సినిమాకు సంబంధించిన స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఆ సినిమా త‌ర్వాత వెంట‌నే ఎన్టీఆర్ మ‌రో ప్రాజెక్టుకు ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం. 'మ‌నం' ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె కుమార్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఎన్టీఆర్ ఆ సినిమాకు ఓకే చెప్పాడ‌ని టాలీవుడ్ టాక్‌.

విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌కత్వంలో త్వ‌ర‌లో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. 13, ఇష్క్‌, మ‌నం, 24 వంటి విల‌క్ష‌ణ క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన విక్ర‌మ్ కె కుమార్‌....ఎన్టీఆర్ కు ఓ అద్భుత‌మైన‌ క‌థ వినిపించార‌ట‌. ఆ క‌థ వినూత్నంగా ఉండ‌డంతో విక్ర‌మ్ తో సినిమా చేయడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. ఎన్టీఆర్ ఇంత‌కుముందు ఎపుడూ చేయ‌ని పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. రొటీన్ క‌థ‌ల‌కు భిన్నంగా ఆ సినిమాను తెర‌కెక్కించాల‌ని విక్ర‌మ్ భావిస్తున్నాడ‌ట‌.

ప్రస్తుతం అఖిల్ తో విక్రమ్ కుమార్ 'హలో' మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా పూర్త‌యిన వెంట‌నే బన్నీతో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. ఈ లోపు త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా పూర్తవుతుంది. ఆ తరువాత ఎన్టీఆర్ - విక్రమ్ కుమార్ ల సినిమా సెట్స్ పైకి వెళుతుంది.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు