దండుపాళ్యం-3 రెడీ అట

దండుపాళ్యం-3 రెడీ అట

‘దండుపాళ్యం’ పేరెత్తగానే ఆ సినిమా చూసిన ప్రేక్షకులకు ఒక రకమైన గగుర్పాటు కలుగుతుంది. కర్ణాటకలో దారుణమైన రీతిలో హత్యలు చేసిన ముఠా గురించి తీసిన సినిమా ఇది. తెలుగువాడైన శ్రీనివాసరాజు.. కన్నడలో కొన్నేళ్ల కిందట తీసిన ఈ చిత్రం సంచలనం రేపింది.

వాస్తవ సంఘటనల్ని చాలా పచ్చిగా చూపిస్తూ శ్రీనివాసరాజు తీసిన ఈ చిత్రం కన్నడలో ఒక క్లాసిక్‌ లాగా నిలిచిపోయింది. ఈ చిత్రం తెలుగులోకి కూడా అనువాదమై మంచి ఆదరణే తెచ్చుకుంది. దానికి కొనసాగింపుగా శ్రీనివాసరాజు ‘దండుపాళ్యం-2’ కూడా తీశాడు. ఐతే తొలి తొలి సినిమాలా ఇది అంతగా ఆదరణ పొందలేదు. తెలుగులో ఈ సినిమా అస్సలు పట్టించుకోలేదు. కన్నడలో కూడా ఈ మూవీ అంతంతమాత్రంగానే ఆడింది.

అయినప్పటికీ శ్రీనివాసరాజు తగ్గట్లేదు. చడీచప్పుడు లేకుండా ‘దండుపాళ్యం-3’ సినిమా తీసేస్తున్నాడతను. ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చిందట. నవంబర్లోనే ఇది ప్రేక్షకుల ముందుకొస్తుందట. ‘దండుపాళ్యం-2’ తీస్తున్నపుడే మూడో భాగానికి సంబంధించి కూడా కొంత చిత్రీకరణ జరిపాడు శ్రీనివాసరాజు. ఆ సినిమాలో మూడో భాగానికి సంబంధించి హింట్ కూడా ఇచ్చాడు.

దండుపాళ్యం తొలి రెండు భాగాల్లో కనిపించిన నటీనటులు ఇందులోనూ కొనసాగుతారు. ఇంతటితో ‘దండుపాళ్యం’ సిరీస్‌కు తెరపడుతుందట. ఐతే రెండో భాగానికే స్పందన అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో మరో సినిమా అంటే జనాలు ఏమాత్రం పట్టించుకుంటారో చూడాలి. ‘దండుపాళ్యం’ కాకుండా శ్రీనివాసరాజు తీసిన సినిమాలన్నీ ఫ్లాపే కావడం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు