‘గుంటూరు టాకీస్’ 25 కోట్లు తెచ్చిందా?

‘గుంటూరు టాకీస్’ 25 కోట్లు తెచ్చిందా?

యువ దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందించిన చివరి సినిమా ‘గుంటూరు టాకీస్’ బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరుగా ఆడిన సంగతి తెలిసిందే. అడల్ట్ కంటెంట్ వల్ల, కొన్ని వివాదాలు తోడవడంతో ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. నిర్మాతలు, బయ్యర్లు లాభాల బాట పట్టారు. ఐతే ఆ సినిమా ఏకంగా రూ.25 కోట్లు వసూలు చేసేసిందంటూ దర్శకుడు ప్రవీణ్ ఇప్పుడు గొప్పలు పోతుండటమే ఆశ్చర్యం.

ఈ విషయాన్ని తన కొత్త సినిమా ‘గరుడవేగ’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ప్రవీణే చెప్పాడు. తన దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్’ ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణే లాంచ్ చేశారని.. రూ.2 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఆ సినిమా రూ.25 కోట్లు వసూలు చేసిందని.. ఇప్పుడు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘గరుడ వేగ’ ట్రైలర్ కూడా బాలయ్యే విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో అంచనా వేయొచ్చని అన్నాడు ప్రవీణ్.

గుంటూరు టాకీస్ థియేట్రికల్ రన్ ద్వారా రూ.5 కోట్లకు అటు ఇటుగా వసూలు చేసినట్లుగా అప్పట్లో వార్తలొచ్చాయి. శాటిలైట్.. ఇతర హక్కుల అమ్మకంతో ఇంకో ఐదు కోట్లు వచ్చినా లెక్క రూ.10 కోట్లను దాటదు. దాన్ని మరీ రూ.25 కోట్లు తెచ్చిన సినిమాగా చెప్పుకోవడం టూమచ్చే.

ఇక రాజశేఖర్ మార్కెట్ ప్రకారం చూస్తే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ‘గరుడవేగ’ పెట్టుబడిని రికవర్ చేస్తుందా అన్నది సందేహమే. మరి ప్రవీణ్ ఏమో 25 కోట్లకు ఎన్ని రెట్లు వసూలు చేస్తుందో అన్నట్లు మాట్లాడేస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు