పబ్లిసిటీ కోసం బాలీవుడ్డోళ్లు అంత దిగజారిపోతారా?

పబ్లిసిటీ కోసం బాలీవుడ్డోళ్లు అంత దిగజారిపోతారా?

బాలీవుడ్ జనాలు పబ్లిసిటీ కోసం ఎంతగా దిగజారి పోతారో చెప్పడానికి గతంలో ఎన్నో రుజువులున్నాయి. ఒక కొత్త సినిమా విడుదలవుతుంటే కావాలనే వివాదాలు క్రియేట్ చేయడం.. ఆ వివాదాలతో పబ్లిసిటీ తెచ్చుకుని సినిమాను వార్తల్లో నిలబెట్టడం కోసం వాళ్లు ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో చాటిచెప్పేలా తాజాగా ఇంకో ఉదాహరణ బయటపడింది.

డైరెక్టర్ టర్న్డ్ హీరో ఫర్హాన్ అక్తర్ హీరోగా ఈ మధ్యే ‘లక్నో సెంట్రల్’ అనే సినిమా ఒకటి రిలీజైన సంగతి తెలిసిందే. ‘ధూమ్-2’ ఫేమ్ నిఖిల్ అద్వానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఐతే ఈ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. యావరేజ్ టాక్‌తో మొదలైన సినిమా బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది.

ఐతే ఈ సినిమా విడుదలకు ముందు సినిమాకు పబ్లిసిటీ పెంచడం కోసం ఏదైనా స్కాండల్ క్రియేట్ చేద్దామంటూ మార్కెటింగ్ టీం దర్శకుడు నిఖిల్ అద్వానీని అడిగిందట. ఆ మాట చెప్పేముందు కంగనా రనౌత్-హృతిక్ రోషన్ గొడవ గురించి కూడా ప్రస్తావించాడట ఆ టీంలోని వ్యక్తి. కంగనా-హృతిక్ గొడవ వల్ల ‘సిమ్రాన్’ సినిమాకు మంచి పబ్లిసిటీ వస్తోందని.. అలాంటిదే తాము కూడా ఏదైనా స్కాండల్ చేస్తే తమ సినిమాకు కూడా ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని ఓ మార్కెటింగ్ తనకు ఫోన్ చేసిన చెప్పినట్లు నిఖిల్ వెల్లడించాడు.

ఐతే హృతిక్-కంగనాల గొడవ ‘సిమ్రాన్’ సినిమాకు పెద్దగా ఉపయోగపడిందేమీ లేదు. సినిమాలో కంటెంట్ లేకపోతే ఏ వివాదమూ పనికి రాదనడానికి ఇది ఉదాహరణ. ఐతే పబ్లిసిటీ కోసం బాలీవుడ్ వాళ్లు ఎంతటికైనా దిగజారుతారని నిఖిల్ వ్యాఖ్యలతో అందరికీ అర్థమైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు