రజినీని కూడా దాటేశాడే..

రజినీని కూడా దాటేశాడే..

సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ ఎవరంటే మరో మాట లేకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు చెప్పేయొచ్చు. ఆయన ఫాలోయింగ్, మార్కెట్ దక్షిణాదిన మరే హీరోకూ సాధ్యం కానివి. రజినీ కొత్త సినిమా వచ్చిన ప్రతిసారీ రిలీజ్ విషయంలో కొత్త రికార్డులు నమోదవుతుంటాయి. ఐతే ఇప్పుడు మరో తమిళ స్టార్ హీరో విజయ్.. రజినీ రికార్డుల్ని సైతం బద్దులు కొట్టేస్తున్నాడు. అతడి కొత్త సినిమా ‘మెర్శల్’ మీద భారీగా అంచనాలున్న సంగతి తెలిసిందే. దీపావళి కానుకగా బుధవారం రిలీజవుతున్న ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 3300 స్క్రీన్లు కేటాయించడం విశేషం.

తమిళంలోనే ఈ చిత్రం 2500కు పైగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. తెలుగు వెర్షన్ కూడా కలిపితే లెక్క 330 చేరుతోంది. ఇప్పటిదాకా ఏ తమిళ సినిమా కూడా ఇంత భారీగా విడుదలైంది లేదు. రజినీ సినిమా ‘కబాలి’ని కూడా ఇంతకంటే తక్కువ థియేటర్లలోనే రిలీజ్ చేశారట. ‘బాహుబలి’ తర్వాత ఇంత భారీ స్థాయిలో రిలీజవుతున్న దక్షిణాది చిత్రం ఇదే. అమెరికాలో మామూలుగా తమిళ సినిమాలు తక్కువ థియేటర్లలోనే రిలీజవుతుంటాయి. కానీ ‘మెర్శల్’ను మాత్రం అక్కడ 250 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.160 కోట్ల దాకా బిజినెస్ జరగడం విశేషం. తెలుగు వెర్షన్‌ హక్కుల్ని శరత్ మరార్ రూ.4.6 కోట్లకు కొని రిలీజ్ చేస్తున్నాడు. ఈ చిత్రం ‘అదిరింది’ పేరుతో రిలీజవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు