మహేష్‌కి ఇది చాలా పెద్ద దెబ్బ

మహేష్‌కి ఇది చాలా పెద్ద దెబ్బ

స్పైడర్‌ చిత్రానికి నూట యాభై కోట్ల గ్రాస్‌ వసూళ్లు వచ్చాయని పోస్టర్లయితే వేసారు కానీ రియాలిటీ దానికి చాలా దూరంగా వుంది. మహేష్‌ స్ట్రాంగ్‌ అయిన ఏరియాల్లో కూడా దీనికి సగానికి పైగా నష్టాలు రావడం నివ్వెరపరిచింది. ఓవర్సీస్‌లో, నైజాంలో అత్యధికంగా బయ్యర్లు నష్టపోయారు. స్పైడర్‌ నైజాంలో కనీసం పది కోట్ల షేర్‌ కూడా తెచ్చుకోలేకపోవడం మహేష్‌ స్టార్‌ వేల్యూకి తీవ్రమైన దెబ్బ అనే చెప్పాలి.

నాని, శర్వానంద్‌ సినిమాలు కూడా నైజాంలో పది కోట్లు అవలీలగా దాటేస్తోన్న రోజుల్లో కేవలం తొమ్మిది కోట్ల పైచిలుకు వసూళ్లతో స్పైడర్‌ డిజాస్టర్లకే డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు ఇరవై నాలుగు కోట్లకి కొనగా, కేవలం తొమ్మిది కోట్లు మాత్రం తిరిగి వచ్చాయి. రికవరీలు, రివర్స్‌ పేమెంట్లు చూసుకున్నా కానీ సగానికి పైగా నష్టం నైజాంలోనే వచ్చింది.

మహేష్‌ వీక్‌ అయిన సీడెడ్‌ లాంటి ఏరియాల్లో అతని స్టార్‌ వేల్యూ మరింత దెబ్బతింది. అదృష్టం కొద్దీ తదుపరి చిత్రం కొరటాల శివతో కావడం మహేష్‌కి కలిసి వస్తుంది. కొరటాల శివకి ఇంతవరకు ఫెయిల్యూర్‌ లేకపోవడం, ఇంతకుముందు మహేష్‌తో అతను శ్రీమంతుడు తీసి వుండడంతో 'భరత్‌ అనే నేను' చిత్రానికి బిజినెస్‌ పరంగా ఇబ్బందులుండవు.

కానీ ఈ టైమ్‌లో మరో ఫెయిల్యూర్‌ని మాత్రం మహేష్‌ తట్టుకోవడం కష్టమే అంటున్నారు. ఆగడు, 1 తర్వాత శ్రీమంతుడితో తిరిగి విజృంభించిన మహేష్‌ ఇప్పుడు బ్రహ్మూెత్సవం, స్పైడర్‌ తర్వాత అలాగే పుంజుకుంటాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు