ప్రభాస్ ఫ్యాన్స్.. గెట్ రెడీ అమ్మా

ప్రభాస్ ఫ్యాన్స్.. గెట్ రెడీ అమ్మా

నాలుగేళ్లకు పైగా ‘బాహుబలి’కి అంకితమైపోయిన ప్రభాస్‌ను ఇంకో కొత్త లుక్‌లో చూసేందుకు అభిమానులు తహతహలాడిపోతున్నారు. ఐతే అభిమానుల్ని ప్రభాస్ వెయిట్ చేయిస్తూనే ఉన్నాడు. ‘సాహో’ సినిమా షూటింగ్ అనుకున్న దాని కంటే చాలా ఆలస్యమైంది.

ఈ చిత్ర షూటింగ్‌లో ఉండగానే ప్రైవేటుగా చేసిన కొన్ని ఫొటో షూట్లకు సంబంధించిన చిత్రాలు అభిమానుల్లో ఉత్సాహం రేకెత్తించాయి. ఐతే సినిమాకు సంబంధించిన అఫీషియల్ లుక్ కోసం ఫ్యాన్స్ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఎట్టకేలకు వాళ్ల నిరీక్షణకు తెరపడబోతున్నట్లు సమాచారం.

దీపావళి కానుకగా ‘సాహో’ ఫస్ట్ లుక్ పోస్టర్లు లాంచ్ చేయబోతున్నారట. అలాగే ఒక మేకింగ్ వీడియో కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇది అభిమానులకు పెద్ద ట్రీటే అంటున్నారు. కొందరు పీఆర్వోలు ఈ సమాచారాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ విషయంపై దర్శకుడు సుజీత్‌ను ప్రశ్నిస్తే.. దీపావళి రోజు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని అన్నాడు.

కాబట్టి దీపావళికి ప్రభాస్ అభిమానులకు విందు గ్యారెంటీ అన్నమాటే. ‘సాహో’ను ఈ ఏడాది ఆరంభంలోనే లాంచ్ చేసినప్పటికీ రెగ్యులర్ షూటింగ్ రెండు నెలల కిందటే మొదలైంది. హీరోయిన్ శ్రద్ధా దాస్.. విలన్ నీల్ నితిన్ ముకేష్.. తమిళ నటుడు అరుణ్ విజయ్.. ఇంకా వివిధ భాషలకు చెందిన చాలామంది నటులు ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది వేసవి చివర్లో ‘సాహో’ ప్రేక్షకుల ముందుకు రావొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు